Dead body : 56 ఏళ్లకు దొరికిన జావాన్ మృతదేహం.. అంత్యక్రియలకు కదిలిన గ్రామాలు..

Dead body

Jawan Dead body

Jawan dead body : ఒక్కోసారి అమర జవాన్ల కుటుంబ గాధలు వింటే కన్నీరు ఆగదు. జీవితం మొత్తం కష్టాలతో.., ధు:ఖించేందుకే పుట్టారా అన్నట్లుగా ఉంటాయి. దేశం కోసం తన వాళ్లు బార్డర్ లో కాపు కాసి మరణిస్తే ఆ విషయం కూడా కుటుంబానికి తెలవచ్చు.. తెలియకపోనూ వచ్చు. ఒక జవాన్ మరణిస్తే తక్కువ జవాన్లు సంచరించే ప్రాంతంలో గస్తీ కాస్తూ మరణిస్తే బహూషా తెలియకపోవచ్చు. అలాంటి ఒక జవాను గాధ వింటే ధు:ఖం ఆగదు.

భారత వైమానిక దళానికి చెందిన ‘ఆంటోనోవ్-12’ విమానం ఫిబ్రవరి 7, 1968న హిమాచల్ ప్రదేశ్ లోని మంచు ఉన్న ప్రాంతాల్లో కూలిపోయింది. ఆ విమానంలో IAF సైనికుడు ముల్ఖాన్ సింగ్ ఉన్నాడు. అప్పుడు ఆయన వయస్సు 23 ఏళ్లు. ఆంటోనోవ్12 చండీగఢ్ నుంచి లేహ్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అయితే మంగళవారం (అక్టోబర్ 1) ఇద్దరు ఇండియన్ ఆర్మీ అధికారులు ఆ దారి నుంచి వెళ్తుండగా ముల్ఖాన్ సింగ్ మృతదేహం కనిపించింది. దీంతో ఆ మృతదేహాన్ని ముల్ఖాన్ స్వగ్రామమైన ఉత్తరప్రదేశ్ లోని సహరాన్ పూర్ జిల్లా నానౌటా పరిధిలోని ఫతేపూర్ గ్రామానికి వచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ముల్ఖాన్ సజీవంగా వస్తాడని వారి ఇంట్లో ఇంకా ఎదురు చూస్తున్నారట. కానీ ఆయన విగతజీవిగా 56 సంవత్సరాలకు రావడంతో కన్నీరు మున్నీరయ్యారు.

ముల్ఖాన్ కుటుంబం ఇప్పుడు ఎలా ఉంది..?

మల్ఖాన్‌ అదృశ్యమైనప్పటి నుంచి అతడి గురించి ఎవరూ తమకు సమాచారం ఇవ్వలేదన్నారు. ఆర్మీలోకి వెళ్లే సమయంలోనే ఆయనకు వివాహం జరిగింది. ఆ తర్వాత ఒక కొడుకు (రామ్ ప్రసాద్) కూడా పుట్టాడు. ఆయన కనిపించకుండా పోయిన చాలా కాలం తర్వాత అతని భార్యను అతని సోదరుడు చంద్రపాల్ సింగ్ కు ఇచ్చి వివాహం చేశారు. ఇక రామ్ ప్రసాద్ కు ఇద్దరు కొడుకులు గౌతమ్ కుమార్ (22), మనీష్ సింగ్ (16) వీరితో పాటు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. 2000 ప్రాంతంలో ముల్ఖాన్ సింగ్ భార్య, రామ్ ప్రసాద్ తల్లి మరణించగా.. 2010లో రామ్ ప్రసాద్ కూడా మరణించాడు. భారీ జనసందోహం మధ్య ముల్ఖాన్ భౌతికకాయం మధ్యాహ్నం ఫతేపూర్‌కు చేరుకుంది. సాయంత్రం తర్వాత అంత్యక్రియలు నిర్వహించారు. ఎట్టకేలకు మల్ఖాన్ సింగ్ ఇంటికి వచ్చాడు కానీ విగత జీవిగా.. గ్రామంతో పాటు రాష్ట్రం కూడా ఆయనకు నివాళి అర్పించింది. ‘ముల్ఖన్ శవం 25 ఏళ్ల క్రితమే దొరికి ఉంటే, అతని భార్య ప్రశాంతంగా విశ్రాంతి తీసుకునేది’ అని బంధువు విశ్వాస్ సింగ్ తెలిపారు.

TAGS