JAISW News Telugu

Rapido Viral Video : పెట్రోల్ అయిపోయినా బైక్ దిగని కస్టమర్.. రైడర్ ఏం చేశాడంటే.. వీడియో వైరల్

A video went viral

A video went viral

Rapido Viral Video : కొందరు వ్యక్తులు విచిత్రంగా ఉంటారు. అసలు వారేం చేస్తున్నారో వారికే అర్థం కాదు. కనీస మానవత్వం కూడా ఉండదు. ఎదుటివాళ్లతో వారి దురుసు ప్రవర్తన చూస్తే ఛీ ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? అనిపిస్తుంది. వీరు చేసే పనులు సిల్లీగా కూడా ఉంటాయి. కొందరు ఆర్టీసీ బస్సుల్లోనూ, ఆటోల్లోనూ తమకు ఒక రూపాయి, రెండు రూపాయల చిల్లర రావాల్సి ఉంటే  గొడవ పెట్టుకుని మరి తీసుకుంటారు. ఇంకొందరు ఎలా ఉంటారంటే తాము చెల్లించిన ప్రతీ రూపాయికి తగిన సేవ లభించాలని కోరుకుంటూ ఉంటారు. ఈక్రమంలో మానవత్వాన్ని మరిచిపోతారు.  ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్థం చేసుకునే హృదయం ఉండదు వారికి. ఈ కోవకు చెందిన ఓ వ్యక్తి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

హైదరాబాద్ లో ఓ వ్యక్తి రాపిడోలో బైక్ బుక్ చేసుకుని వెళ్తుండగా మార్గమాధ్యంలో పెట్రోల్ అయిపోయి బైక్ ఆగిపోయింది. దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ వరకూ కాస్త నడవండి సార్.. అంటూ ఆ వ్యక్తిని రైడర్ కోరాడు. దీనికి ఆ కస్టమర్ ‘నేను నీకు డబ్బులు చెల్లించాను.. నేను దిగను..’’ అని కనికరం లేకుండా తిరస్కరించాడు. దీంతో ఏం చేయాలో పాలుపోక  ఆ బైక్ ను కస్టమర్ కూర్చుండగానే నెట్టుకుంటూ వెళ్లాడు. ఈసురోమంటూ బైక్ ను పెట్రోల్ బంక్ దాక వెళ్లి పెట్రోల్ పోయించి బైక్ ను స్టార్ట్ చేసి కస్టమర్ ను గమ్యం చేర్చాడు.

రైడర్ పడిన కష్టాన్ని వెనక నుంచి గమనించుకుంటూ వస్తున్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాజాగా ఆ వీడియో తెగ వైరల్ అయ్యింది. కనికరం లేని కస్టమర్ ను చూసి తిట్టుకోని నెటిజన్ లేడు. అతడి ప్రవర్తనను ఎంతో మంది ఈసడించుకుంటున్నారు. ‘‘నువ్వు ఇచ్చే పది, ఇరువై రూపాయలకు నిన్ను తోసుకుంటూ వెళ్లాలా? ఇదేం నీచబుద్ధి’’ అంటూ మండిపడుతున్నారు. ఇలాంటి కూడా ఉంటార్రా అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

Exit mobile version