Chandrababu : పరదాలు పాయె.. చెట్లు నరుకుడు లేకపాయె.. సాదాసీదాగా ప్రజల మధ్య చంద్రబాబు

Chandrababu

Chandrababu

Chandrababu : ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభమైంది. దీపం 2.0లో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించారు. ఓ మహిళా లబ్ధిదారుని ఇంటికి వెళ్లి ఉచితంగా గ్యాస్ సిలిండర్‌ను అందజేసిన చంద్రబాబు స్వయంగా స్టౌ వెలిగించి టీ తయారు చేశారు. అనంతరం మంత్రులతో కలిసి తాగారు. చంద్రబాబు వెంట రామ్మోహన్ నాయుడు, నాదెండ్ల మనోహర్ తదితరులు ఉన్నారు. అనంతరం చంద్రబాబు బహిరంగ సభలో పాల్గొన్నారు. వైసీపీ హయాంలో బలవంతంగా సభలకు తీసుకెళ్లారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. వైసీపీ నేతలు ప్రజాస్వామ్య హద్దులు దాటి ఇబ్బందులకు గురిచేశారని, తాను బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధినని, తప్పు చేసిన వారిని వదిలిపెట్టబోనని అన్నారు. తాను రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడబోనని చెప్పారు. నాయకుడంటే ప్రజల గుండెల్లో ఆప్యాయత ఉండాలని, ఆయన అరెస్టు తర్వాత తెలుగు ప్రజలంతా స్పందించారని, గత ఎన్నికల్లో తెలుగు తమ్ముళ్లు, ప్రజా సైనికులు రాజీలేని పోరాటం చేశారని, అందరం కలిసి రాష్ట్రాన్ని కాపాడామని అన్నారు.  విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తున్నామని, విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటికే రెండు మూడు సమావేశాలు జరిగాయన్నారు. విశాఖ రైల్వే జోన్ కు లైన్ క్లియర్ అయిందని, రేపు లేదా రేపు శంకుస్థాపన చేస్తామని, టెక్కలి లేదా పలాసలో విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని, మూలాపేటలో 10 వేల ఎకరాల్లో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తామన్నారు.

వాస్తవానికి చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడూ కూడా ప్రజల మధ్యకు వెళ్లేందుకుదుకు ఎన్నడూ జంకలేదు. నిత్యం ప్రజల మధ్యనే కనిపిస్తుంటారు. ఇందుకు తాజా ఉదాహరణ శ్రీకాకుళంలో జరిగిన ఘటన. చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలకు వెళ్లినప్పుడు జగన్‌లాగ పచ్చటి చెట్లు నరికించలేదు. రోడ్లకిరువైపులా పరదాలు కట్టించుకోరు. నేరుగా ప్రజల మద్యకు వెళ్లిపోతారు. రాష్ట్ర ప్రజలపై అంత నమ్మకం ఆయనకి! ప్రజలకి కూడా ఆయనపై చాలా నమ్మకం ఉంది కనుకనే 2024 ఎన్నికలలో గెలిపించి ముఖ్యమంత్రిని చేశారు.  కానీ జగన్‌ నేటికీ బెంగళూరు, తాడేపల్లి ప్యాలస్‌ గడప దాటి జనం మద్యకు వచ్చేందుకు భయపడుతూనే ఉన్నారు.  చంద్రబాబుకి, జగన్మోహన్‌ రెడ్డికి, అదేవిధంగా టిడిపికి, వైసీపికి మద్య ఉన్న ఈ తేడాయే టీడీపీకి ప్రజాధరణ కల్పిస్తోందని చెప్పవచ్చు.

TAGS