Daggubati Family : దగ్గుబాటి ఫ్యామిలీ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. దగ్గుబాటి రామానాయుడు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు మంచి నిర్మాత. టాలీవుడ్ మూవీ మొఘల్ అని గుర్తింపును కూడా తెచ్చుకున్నారు. ఆయన వారసుల్లో సురేశ్ బాబు నిర్మాతగా, వెంకటేశ్, రానా, అభిరామ్ లు హీరోలుగా టాలీవుడ్ లో చలామని అవుతున్నారు. అలాంటి ఫ్యామిలీ కొన్నేళ్ల క్రితం ఒక వివాదంలో చిక్కుకుంది. దగ్గుబాటి ఫ్యామిలీలోని కొందరిపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. అసలు ఎందుకు అలా ఆదేశించిందో ఇక్కడ చూద్దాం.
డెక్కన్ కిచెన్ కూల్చివేత..
ఫిల్మ్ నగర్‌లో ‘డెక్కన్ కిచెన్’ అనే ఒక హోటల్ ఉండేది. అది దగ్గుబాటి ఫ్యామిలీ స్థలంలో ఏర్పాటు చేసుకున్నారు. లీజు పూర్తియినా కూడా నిర్వాహకులు రెన్యూవల్ చేసుకోకుండా. దగ్గుబాటి ఫ్యామిలీని అడగకుండా కొనసాగిస్తున్నారు. దీనిపై దగ్గుబాటి హీరోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి భద్రతతో జీహెచ్‌ఎంసీ అధికారులు ‘డెక్కన్ కిచెన్’ కూల్చివేశారు. ఇది సెన్సేష గాన్ అయింది.
కోర్టును ఆశ్రయించిన బాధితులు
దగ్గుబాటి ఫ్యామిలీ ఇచ్చిన ఫిర్యాదుతో ‘డెక్కన్ కిచెన్’ కూల్చివేయడంతో.. నిర్వాహకుడు నందకుమార్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కూల్చివేతతో తనకు కోట్లల్లో నష్టం వచ్చిందని ఆరోపించారు. ఇంకా, విక్టరీ వెంకటేష్, సురేష్ బాబు, రానా, అభిరామ్‌తో పాటు జీహెచ్ఎంసీ అధికారులపైన కూడా కేసులు పెట్టారు.
చీవాట్లు పెట్టిన ధర్మాసనం
ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు జీహెచ్ఎంసీ కమిషనర్, నిర్మాత సురేశ్ బాబుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు స్టే ఉండగా అధికారులు ఎలా కూల్చివేస్తారని.. అర్జంట్‌గా కూల్చేయాల్సిన అవసరమేముందని ధర్మాసనం ప్రశ్నించింది. అంతేకాదు, ఇది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని తేల్చి చెప్పింది.
కేసు నమోదు చేయాలి
నంద కుమార్ పిటీషన్‌పై విచారణ చేసిన నాంపల్లి కోర్టు దగ్గుబాటి కుటుంబానికి షాక్ ఇచ్చింది. దగ్గుబాటి సురేష్ బాబు, వెంకటేష్, రానా, అభిరామ్‌పై ఐపీసీ సెక్షన్లు 448, 452,380, 506,120b కింద కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ తీర్పుతో టాలీవుడ్‌లో కలకలం రేగుతోంది.