JAISW News Telugu

Anant Ambani : ఒక్కో వాచీ ఖరీదు రూ.2 కోట్లు.. గిఫ్ట్‌గా ఇచ్చిన అనంత్ అంబానీ

Anant Ambani

Anant Ambani Wedding Celebrations

Anant Ambani : రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహం ఈనెల 12న ఘనంగా నిర్వహించారు. గత ఏడాది డిసెంబర్ లో ఎంగేజ్ మెంట్ తర్వాత దాదాపు ఏడు నెలల పాటు అంబానీ ఇంట వేడుకలు జరిగాయి. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్సన్ లో వివాహంతో అనంత్-రాధిక ఒక్కటయ్యారు. శనివారం జరిగిన ఆశీర్వాద వేడుకకు భారత ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు, టీమిండియా క్రికెటర్లు సహా ప్రపంచం నలుమూలల నుంది వేలాదిమంది అతిథులు విచ్చేశారు.

తాజాగా ఈ వేడుకకు సంబంధించిన ఓ వీడియో వైరలవుతోంది. వరుడు అనంత్ అంబానీ తన స్నేహితులైన బాలీవుడ్ నటులు షారుక్ ఖాన్, రణవీర్ సింగ్, షికర్ పహాకియా, వీర్ పహారియా, మీజాన్ జాఫరి తదితరులకు ఒక్కొక్కరికి రూ.2 కోట్ల విలువైన రిస్ట్ వాచీలు బహుమతిగా అందజేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి.

లగ్జరీ వాచీలకు పేరెన్నికగన్న అడమోర్స్ పిగ్యుట్ ఓక్ క్యాలెండర్ లిమిటెడ్ ఎడిషన్ వాచీలను ప్రముఖులు బహుమతిగా అందుకున్నారు. అనంతరం అందరూ కలిసి చేతికి ధరించిన వాచీలు చూపిస్తూ ఫొంటోలు, వీడియోలకు పోజిచ్చారు. దానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

Exit mobile version