Remake : బాక్సాఫీస్ వద్ద భారీగా హిట్టయిన సినిమాలు ఏ ల్యాంగ్వేజీలో ఉన్నా రీమేక్ చేయడం మామూలే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో భారీ సంచలనం సృష్టించిన స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నిర్మించిన ‘కిల్’ తెలుగులో రీమేక్ చేయాలని అనుకుంటున్నారు. కిల్ రిలీజ్ కు ముందు దీనికంటే భయకరమైన మూవీ మరోటి లేదు అన్నట్లుగా.. భారీ హైప్ క్రియేట్ చేశారు. చెప్పినట్లుగానే భారీ యాక్షన్ థ్రిల్ సీన్స్ తో కిక్ ఇచ్చింది. ఈ క్రమంలో తెలుగులో రీమేక్ కు పర్మిషన్ కోసం ఇద్దరు టాలీవుడ్ హీరోలు కరణ్ జోహార్ ను సంప్రదించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
జూలై 5న కిల్ రిలీజైంది. ఈ మూవీ రిలీజ్కు ముందు ఎలాంటి హైప్ ను క్రియేట్ చేసిందో అదే కొనసాగించింది. భారీగా కలెక్షన్లను రాబడుతూ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటుంది. స్టోరీ వినేందుకు చాలా సింపుల్ గా ఉన్నా.. యాక్షన్, థ్రిల్ సీన్స్ చూస్తే మాత్రం గూస్ బంబ్స్ రావాల్సిందే. ట్విస్టులు లేకుండా.. రక్తపాతం బాగా ఉంటుంది. హీరో రౌడీలపై తీర్చుకున్న రివెంజ్ ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా కనిపించలేదు. కాగా ఈ మూవీకి నిఖిల్ నగేష్ భట్ దర్శకత్వం వహించారు. ఇక లక్ష్య, ఆశిష్ విద్యార్థి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ బ్లాక్ బస్టర్ సినిమా రీమేక్ రైట్స్ కోసం ఇద్దరు టాలీవుడ్ హీరోలు పోటీ పడుతున్నారు. వారిలో ఒకరు కిరణ్ అబ్బవరం, రెండో వారు సుధీర్ బాబు. వీరిలో రైట్స్ ఎవరికి దక్కుతాయో వేచి చూడాలి.
సుధీర్ బాబు రీసెంట్ గా ‘హరోం హర’తో డీసెంట్ టాక్ ను సొంతం చేసుకున్నాడు. సేఫ్టీ జోన్ లోనే కొనసాగుతున్నారు. దీని తర్వాత సినిమా విషయంలో కొంచెం జాగ్రత్త వహిస్తే కెరీర్ లో వెనక్కు తిరిగి చూసే అవసరం లేదు. సుధీర్ బాబు ప్రయోగాత్మక సినిమాలనే తీస్తుంటారు. ఈసారి ఎలాంటి స్టోరీ ఎంచుకుంటారనేదానిపై ఆయన ఫాన్స్ ఆసక్తిగా ఎదిరిచూస్తున్నారు. ఇక మరొక హీరో కిరణ్ అబ్బవరం విషయానికొస్తే.. కొన్నాళ్లు అనేక కారణాల వల్ల గ్యాప్ వచ్చినా.. ఇప్పుడు బిజీగానే ఉన్నాడు. రీసెంట్ గా తన కొత్త సినిమా ‘క’కు సంబంధించి పోస్టర్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతానికి ఇద్దరూ బిజీగానే ఉన్నారు. మరి కిల్ మూవీ రైట్స్ ఎవరికి దక్కుతాయో చూడాలి.