JAISW News Telugu

Sikkim : ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజే సీఎం సతీమణి రాజీనామా

Sikkim

Sikkim

Sikkim : సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్‌ సింగ్‌ తమాంగ్‌ సతీమణి కృష్ణకుమారి రాయ్‌ గురువారం తన ఎమ్మెల్యే పదవికి హఠాత్తుగా రాజీనామా చేశారు. ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజే రాజీనామా చేసినా కారణాలు మాత్రం తెలియరాలేదు. ఆమె రాజీనామాను స్పీకర్‌ ఎంఎన్‌ షెర్పా ఆమోదించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె నంచిసింగితాంగ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ముఖ్యమంత్రిగా పెమా ఖండూ ప్రమాణస్వీకారానికి హాజరయ్యేందుకు అరుణాచల్ ప్రదేశ్ కు వెళ్లిన ప్రేమ్ సింగ్ తన భార్య రాజీనామాపై ఫేస్ బుక్ లో స్పందించారు. పార్టీ సంక్షేమం, లక్ష్యాలకు ప్రాధాన్యం ఇస్తూ పార్టీ ఏకగ్రీవ నిర్ణయంతో కృష్ణకుమారి రాయ్ తన స్థానాన్ని ఖాళీ చేశారని ఆయన తెలిపారు. తనతో పాటు కృష్నరాయ్ సైతం ప్రజాసేవలో పూర్తిగా అంకితమవుతారని, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని, అక్కడ ఎన్నికైన కొత్త అభ్యర్థికి పూర్త సహకారం అందిస్తామని ఆయన హామీనిచ్చారు.

Exit mobile version