Election Commission: కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు కీలక ప్రకటన జారీ చేసింది.. రాజకీయ ప్రచారం కోసం పార్టీలు కానీ అభ్యర్థులు కానీ చిన్నపిల్లలను వాడకూడదని ఈసీ పేర్కొంది. ర్యాలీలు ప్రచారం ప్రకటనలో పిల్లలను దూరంగా ఉంచాలని ఈసీ తన ప్రకటనలో వెల్లడించింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఈ ప్రకటన విడుదల చేసినట్లు తెలుస్తోంది. పోస్టర్లు, పాంప్లెట్లు పంపిణీలో కానీ నినాదాలు చేయడానికి కూడా పిల్లలను వాడకూడదని ఈసీ తెలిపింది. ర్యాలీల సమయంలో తమతో పాటు చిన్న పిల్లలను తీసుకొని రాకూడదని ఈసీ పేర్కొంది. నియమావళి ఉల్లంఘించిన వారికి కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ రాజకీయ పార్టీలను హెచ్చరించింది.