TS to TG Registrations : ‘TS’ స్థానంలో ‘TG’ వాహనాల ప్రీఫిక్స్ రిజిస్ట్రేషన్ ను ఆమోదించిన కేంద్రం..
TS to TG Registrations : గత ప్రభుత్వ బీఆర్ఎస్ వాసలను పూర్తిగా తొలగించేందుకు రేవంత్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వాహనాల రిజిస్ట్రేషన్ కు సంబంధించి నెంబర్ ప్లేట్లపై గతంలో ఉన్న ‘TS (Telangana State)’ స్థానంలో ‘TG (TelanGana)’ను తీసుకువచ్చింది. ఈ మార్పునకు కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించింది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ మంగళవారం (మార్చి 12) గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ ప్లేట్లపై కొత్త ప్రి ఫిక్స్ తక్షణమే అమల్లోకి వస్తుందని న్యూఢిల్లీలోని తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి తెలిపారు.
‘మోటారు వాహనాల చట్టం, 1988 (59 ఆఫ్ 1988)లోని సెక్షన్ 41లోని సబ్-సెక్షన్ (6) ద్వారా అందించబడిన అధికారాలను ఉపయోగించి కేంద్రం దీన్ని ఆమోదించింది.
‘ఈ నోటిఫికేషన్ అధికారిక గెజిట్‌లో ప్రచురించిన తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. అనగా, నోటిఫికేషన్‌లో, టేబుల్‌లో, క్రమ సంఖ్య 29A మరియు దానికి సంబంధించిన ఎంట్రీల కోసం, కింది ఎంట్రీలు ప్రత్యామ్నాయంగా ఉంటాయి, అవి, ‘29A. తెలంగాణ టీజీ’ అని ఏఎన్ఐ పేర్కొంది .
‘భారత ప్రభుత్వం వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లపై TS నుండి TGని ఆమోదించింది. రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్‌ను తక్షణమే విడుదల చేసింది, అంటే 12 మార్చి, 2024. ఈ మార్పు నియంత్రణ స్పష్టత మరియు ప్రభావాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది,’ అని ప్రకటన కాపీ జత చేసింది.
ఈ మార్పు కొత్త వాహనాలకు వర్తిస్తుందని, గతంలో TS ప్లేట్లతో వాహనాలు కొనసాగుతాయి. రోడ్లపైకి వచ్చే కొత్త వాహనాలు రాష్ట్రంలో TG ప్రిఫిక్స్‌తో రిజిస్టర్డ్ నంబర్ ప్లేట్‌లను కలిగి ఉంటాయని తెలుస్తోంది. అయితే, పాత వాహన యజమానులు కూడా కావాలంటే TGని యాడ్ చేసుకొని వాడుకోవచ్చని చెప్తున్నారు.