Enumeration survey : సగం వరకు పూర్తయిన కుల గణన సర్వే.. మిగతా పరిస్థితేంటి..?
గణన ఇప్పటి వరకు 58.3 శాతం పూర్తయింది. తెలంగాణ వ్యాప్తంగా 1,16,14,349 ఇళ్లను స్టిక్కర్లు వేసి గుర్తించగా.. ఆదివారం సాయంత్రానికి 67,72,246 ఇళ్లలో సర్వే ప్రక్రియ పూర్తయ్యింది. సర్వేలో 87,807 మంది ఎన్యుమరేటర్లు, 8,788 మంది పర్యవేక్షకులు పాల్గొన్నారు.
* సర్వేలో గుర్తించిన మొత్తం ఇళ్లు: 1,16,14,349. ఇందులో గ్రామీణంలో 64,41,183, పట్టణంలో 51,73,166 ఉన్నాయి.
* రాష్ట్రాన్ని మొత్తం 92,901 బ్లాకులుగా విభజించారు. ఇందులో గ్రామీణ ప్రాంతం 52,493 బ్లాకులు, పట్టణ ప్రాంతంలో 40,408 బ్లాకులున్నాయి.
* సర్వేలో 87,807 మంది ఎన్యుమరేటర్లు వివరాలు నమోదు చేసుకుంటుండగా.. గ్రామీణ ప్రాంతంలో 47,561 మంది, పట్టణాల్లో 40,246 మంది వివరాలను నమోదు చేస్తున్నారు.
* సర్వేను సమన్వయం చేసేందుకు 8,788 మంది పర్యవేక్షకులను ప్రభుత్వం నియమించింది. ఇందులో 4,947 మంది గ్రామాలలో, 3,841 మంది పట్టణాల్లో ఉన్నారు.
* ఆదివారం నాటికి ములుగు జిల్లాలో అధికంగా 87.1 శాతం పూర్తయింది. ఆ తర్వాతి ప్లేస్ లో నల్లగొండ జిల్లా 81.4 శాతంతో ఉంది. జనగామ 77.6 శాతం, మంచిర్యాల 74.8 శాతం, పెద్దపల్లి జిల్లా 74.3 శాతం సర్వే పూర్తయినట్లు అధికారులకు ధ్రువీకరించారు.
* అధిక జనసాంద్రత ఉన్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 38.3 శాతం మాత్రమే పూర్తయినట్లు అధికారులు చెప్తున్నారు.