Sai Dharam Tej : యూట్యూబర్లు, కంటెంట్ క్రియేటర్లు తమ హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. హరోం హర సినిమాలో నటించిన తెలుగు కంటెంట్ క్రియేటర్ ప్రణీత్ హనుమంతు తండ్రీ కూతుళ్ల బంధంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందించారు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.
ప్రణీత్ హనుమంతు యాక్టర్ కంటే తెలుగు కంటెంట్ క్రియేటర్ గానే ఎక్కువ మందికి సుపరిచితుడు. ముఖ్యంగా తెలుగు సినిమాలకు రివ్యూలు రాస్తూ ఇతరుల జీవితాల గురించి మూవీల గురించి కామెంట్లు చేస్తుంటాడు. దీంతో అతడిని సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటూనే ఉంటారు. అంతలా ట్రోల్స్ కు గురవుతుంటాడు. తాజాగా ప్రణీత్ హనుమంతు పేదోడు జోక్స్, ఇన్ సెస్ట్ పేరుతో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఓ తండ్రి కూతురు చేసిన వీడియో పై అసభ్యకర కామెంట్లు చేశాడు.
తండ్రీ కూతుళ్ల బంధాన్ని నీచంగా చూపిస్తూ అతి ఘోరంగా మాట్లాడారు. దీనిపై నెటిజన్లతో పాటు ఇతర సమాజ సంఘాలు చాలా దారుణంగా విమర్శలు చేస్తున్నాయి. అతడిపై పొక్సో చట్టం కింద కేసు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి మనిషికి ఉండే స్వేచ్చను ఇలా దుర్వినియోగం చేసుకుంటున్న వారి గురించి అందరూ ఆలోచించాలని చెబుతున్నారు.
ప్రతి ఒక్కరూ తమ పరిధిలో మాత్రమే ఉండాలని పరిధి దాటి మానవ బంధాలు, ఆత్మీయతల గురించి నీచపు వ్యాఖ్యలు చేయడం సరికాదని సూచిస్తున్నారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఎప్పుడూ పరిధి దాటి ప్రవర్తించను. కానీ ఈ సారి గీత దాటాను.. నన్ను క్షమించండి అంటూ ప్రణీత్ హనుమంతూ అన్నారు. తప్పు చేశాను క్షమించండంటూ వేడుకుంటున్నాడు. అయితే ఇలా ఆడవాళ్ల గురించి నీచంగా మాట్లాడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రణీత్ తాను వీడియోలో అసభ్యకరంగా ఉన్న పార్టులను ఎడిట్ చేసి తీసేశాడు.