Ghat Road : ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు హైదరాబాద్ నుంచి నాగపూర్ వెళ్తున్న కారు నిర్మల్ సమీపంలోని మహబూబ్ ఘాట్ రెండో సెక్షన్ లో పొగమంచు కారణంగా దారి కనిపించక అదుపు తప్పి లోయలో పడిపోయింది. డయల్ 100 ద్వారా నిర్మల్ కంట్రోల్ రూంకు సమాచారం రావడంతో వెంటనే అప్రమత్తమైన నిర్మల్ డిసిఆర్బి ఇన్ స్పెక్టర్ గోపినాథ్, సారంగపూర్ ఎస్సై శ్రీకాంత్ వెళ్లి వారిని లోయలో కారుని గుర్తించారు.
అనంతరం కారులో ఉన్న ముగ్గురు రాధాకృష్ణ, ఆయన భార్య, కుమారుడిని బయటికి తీసుకు వచ్చారు. ఆ ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితులు హైదరాబాద్ సరూర్ నగర్ కు చెందినవారిగా గుర్తించారు. చికిత్స కోసం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సకాలంలో స్పందించి బాధితులను కాపాడిన డిసిఆర్బి ఇన్ స్పెక్టర్ గోపినాథ్, ఎస్సై శ్రీకాంత్ లను నిర్మల్ ఎస్పీ డా. జానకీ షర్మిల అభినందించారు.