JAISW News Telugu

AP News : ఏపీలో ఇక నుంచి ఆ చానళ్ల ప్రసారాలు బంద్

AP News

AP News

AP News : ఏపీలో టీడీపీ కూటమి చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. గత ఐదేండ్లలో వైసీపీ చేసిన అరాచక పాలనకు ప్రజలు సమాధి కట్టారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి గంపగుత్తగా ఓట్లు వేశారు. దీంతో జిల్లాలకు జిల్లాలను కూటమి స్వీప్ చేసింది. గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించి విర్రవీగి అహంకారపూరిత పాలనతో జగన్ ప్రజలతో ఛీకొట్టించుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితం చేసి కర్రుకాల్చి వాత పెట్టారు.

వైసీపీకి అధికారాన్ని దుర్వినియోగం చేసింది. ప్రతిపక్ష నేతలను ఎన్నో ఇబ్బందులు పెట్టింది. వైసీపీ దుశ్చర్యలకు సాక్షి, టీవీ 9, ఎన్ టీవీ, టెన్ టీవీ వంటి చానళ్లు కొమ్ముకాశాయి. ప్రతిపక్షనేతలను కించపరుస్తూ, బురద జల్లుతూ వారిని అవమానించాయి. అధికార పార్టీకి బాకా ఊదుతూ జగన్ ఏది చేస్తే అదే అద్భుతమంటూ పొగిడాయి. ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలపై విషం చిమ్మాయి. వాస్తవాలను దాచిపెట్టి వైసీపీతో కలిసి అబద్ధపు వార్తలను ప్రసారం చేశాయి. రాష్ట్రం అన్ని రంగాల్లో భ్రష్టుపట్టిపోతున్నా వైసీపీ మద్దతుగా కథనాలు వండివార్చాయి.

తాజా అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. అతలాకుతలమైన ఏపీని చక్కదిద్దేందుకు చంద్రబాబు, పవన్ కసరత్తు చేస్తున్నారు. అయితే టీడీపీ కూటమి అలా గెలిచిందో లేదో విష ప్రసారాలు మొదలుపెట్టాయి. దీంతో కేబుల్ ఆపరేటర్లు స్వచ్ఛందంగా సదరు టీవీ ప్రసారాలను నిలిపివేస్తున్నట్లు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర భవిష్యత్ కోసమే ఇలా చేస్తున్నట్లు వారు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రం అన్ని రంగాల్లో అధమస్థానానికి వెళ్లిందని.. దార్శనిక పాలకుడు చంద్రబాబు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దాలంటే రాష్ట్రంలో కొన్ని చానళ్ల విషపు ప్రచారం ఆగిపోవాల్సిందేనంటూ కేబుల్ ఆపరేటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. కాగా, జగన్ సర్కార్ కుప్పకూలగానే వైసీపీ కరపత్రిక సాక్షి సర్క్యూలేషన్ లక్షల్లో పడిపోయినట్టు సమాచారం. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉండగా..ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ సచివాలయాల్లో సాక్షి పత్రిక చందాలను నిలిపివేశారు. దీంతో పది లక్షలకు పైగా సర్క్యూలేషన్ పడిపోయిందని చెబుతున్నారు.

Exit mobile version