Bride : నిన్న పరారైన వధువు.. నేడు ప్రియుడితో పీఎస్ లో ప్రత్యక్షం

bride in Police station : కర్నూలు జిల్లా పత్తకొండలో శుక్రవారం తెల్లవారుజామున అదృశ్యమైన పెళ్లికూతురు ఈ రోజు (శనివారం) తన ప్రియుడితో కలిసి పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షమైంది. పత్తికొండలోని గోపాల్ ప్లాజాలో కొన్ని గంటల్లో పెళ్లి జరగాల్సి ఉండగా పెళ్లి కూతురు వైష్ణవి కనిపించకుండా పోయింది. ఆమె ఓ యువకుడితో వెళ్లిపోయిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అయితే, ప్రియుడు విశ్వాస్ ని పెళ్లి చేసుకున్న వైష్ణవి ఈరోజు పత్తికొండ పీఎస్ కు వచ్చింది. దీంతో ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

అనంతపురానికి చెందిన నరేంద్ర కుమార్ కుమార్తె వైష్ణవికి, కృష్ణగిరి మండలం లక్కసాగరం గ్రామానికి చెందిన బజారి కుమారుడికి పెద్దలు పెళ్లి నిశ్చయించారు. తెల్లవారితే పెళ్లి, రాత్రి సంప్రదాయాల ప్రకారం కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే, అమ్మాయికి ఇష్టం లేకపోవడంతో శుక్రవారం తెల్లవారుజామున పత్తికొండలోని గోపాల్ ప్లాజా కల్యాణ మండపం నుంచి వెళ్లిపోయింది. దీంతో పెళ్లి నిలిచిపోయింది. పత్తికొండ పోలీస్ స్టేషన్ లో వధువు తండ్రి ఫిర్యాదు చేశారు. తెల్లవారు జామున 4 గంటలకు కల్యాణ మండపం నుంచి ఒక అబ్బాయితో బైక్ పై వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయిన విషయం విదితమే.

TAGS