Border-Gavaskar trophy : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో కంగారెత్తిస్తున్న టీమిండియా

Border-Gavaskar trophy

Border-Gavaskar trophy

Border-Gavaskar trophy : టీమిండియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ఆస్ట్రేలియా క్రికెట్ సన్నాహాలు పూర్తి చేసింది. టీమిండియాతో సిరీస్ అనగానే ఆస్ర్టేలియా జట్టు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నది. వరుసగా రెండుసార్లు భారత్ చేతిలో స్వదేశంలో ఓటమిని ఎదుర్కొవడమే ఇందుకు కారణం. వచ్చే నెల 22 నుంచి పెర్త్‌లో జరిగే మ్యాచ్‌తో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మొదలు కానుంది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియా ప్రత్యేక మ్యాచ్‌ ఆడుతుంది. ఈ సిరీస్‌కు సన్నద్ధమయ్యేందుకు  టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సేన భారత్ ఏ తో ఆడనుంది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమిండియా వార్మప్ మ్యాచ్ ఆడనుంది.  సీనియర్ భారత జట్టు ఆస్ట్రేలియా చేరుకోవడానికి కొద్ది రోజుల ముందుగానే ఇండియా ఏ జట్టు ఆస్ట్రేలియాకు చేరుకోనుంది. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఆడేందుకు ఇండియా ఏ జట్టు ఆస్ట్రేలియాకు పయనం కానుంది. రుతురాజ్ గైక్వాడ్ ఈ జట్టుకు నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. టీమిండియాతో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడేందుకు భారత్ ఏ జట్టు సిరీస్ ఆడిన తర్వాత కొన్ని రోజులు అక్కడే ఉండనుంది. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ నవంబర్ 15-17 మధ్య నిర్వహించనున్నారు.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కంటే ముందుగా టీమిండియా న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లతో  తలపడనుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ను 2-0 తేడాతో గెలుచుకోవడంలో టీమిండియా సఫలమైంది. అనంతరం టీ20 సిరీస్‌లో కూడా 3-0 తేడాతో ఘన విజయం అందుకుంది. రోహిత్ శర్మ నేతృత్వంలో టీమిండియా న్యూజిలాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కు సన్నద్ధమవుతున్నది. అక్టోబర్ 16 నుంచి బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.  రెండో మ్యాచ్ పుణెలో అక్టోబర్ 24 నుంచి 28 వరకు నిర్వహించనున్నారు. చివరి టెస్టు ముంబైలోని వాంఖడే స్టేడియంలో నవంబర్ 1 నుంచి 5 వరకు షెడ్యూల్ ఖరారైంది. దీని తర్వాత టీమిండియా దక్షిణాఫ్రికాలో పర్యటించి 4 టీ20 మ్యాచ్‌లు ఆడి నేరుగా అక్కడి నుంచే ఆస్ట్రేలియా వెళ్లనుంది.

TAGS