JAISW News Telugu

Sri Lanka : శ్రీలంక టూర్ కు వాళ్ల ఎంపిక వెనుక పెద్ద కథ.. గంభీర్ కావాలనే సెలెక్ట్ చేశారు?

Sri Lanka

Gambhir

Sri Lanka Vs India : శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. జూలై 27 నుంచి ప్రారంభమయ్యే ఈ టూర్‌లో టీం ఇండియా 3 మ్యాచ్‌ల టీ20, వన్డే సిరీస్‌లు ఆడనుంది. వన్డేలో రోహిత్ శర్మ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, సూర్యకుమార్ యాదవ్‌కు టీ20 జట్టు బాధ్యతలు అప్పగించారు. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తన తొలి ఎంపికలో యువ ఆటగాళ్లకు పెద్దపీట వేశాడు. జూలై 18న ప్రకటించిన జట్టులో ఆరుగురు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ప్లేయర్లు ఎంపికవడం గమనార్హం. గంభీర్ కోచ్ అవ్వగానే కేకేఆర్ ఆటగాళ్ల ఫేట్ మారిపోయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి..

గంభీర్ తన అభిమాన ప్లేయర్లకే అవకాశం ఇచ్చాడా? 

శ్రీలంక పర్యటనకు వెళ్లే జట్టులో ఆరుగురు కేకేఆర్ ప్లేయర్లు ఉన్నారు. అయితే వీరంతా గంభీర్ కెప్టెన్సీలో, లేదా మెంటర్‌షిప్‌లో  ఆడిన వాళ్లే కావడం విశేషం. గంభీర్ ఎప్పుడూ తన వ్యక్తిగత ప్రాధాన్యతలను పక్కనబెట్టి జట్టును అగ్రస్థానంలో నిలపడంపైనే  దృష్టిపెడతానని చెబుతుంటాడు. అయితే ఈ టూర్ కు వెళ్లే ప్లేయర్లలో అతని అభిమాన ఆటగాళ్లు ఉన్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

 
వారిపై ప్రేమ కురిపించాడా?

జట్టుకు ఎంపికై వారిలో పేరు ప్రస్తుత కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్. దాదాపు 8 నెలల పాటు జట్టుకు దూరంగా ఉన్నాడు. క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు బీసీసీఐ అతనిపై చర్య తీసుకుంది . సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి కూడా అతనిని తొలగించింది. అయితే గంభీర్ రాగానే తిరిగి జట్టులోకి వచ్చేలా చేశాడు. రంజీ ఆడమని బోర్డు అతనిని కోరింది, గంభీర్ స్వయంగా దీనిని సమర్ధిస్తున్నాడు. దేశవాళీ క్రికెట్లో చూపిన ఆధారంగానే జాతీయ జట్టులోకి రావాలి. కానీ ఇక్కడ నిబంధనలు మారాయి. ఇషాన్ కిషన్‌కి ఇప్పటికీ అవకాశం రాలేదు. దీంతో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాడని గంభీర్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గంభీర్‌కి అయ్యర్ అంటే చాలా ఇష్టం. దీనికి ఐపీఎల్‌లో ఓ ఉదాహరణ కనిపించింది. ఐపీఎల్‌లో ఢిల్లీ కెప్టెన్సీని అయ్యర్‌కు అప్పగించాడు. ఇక మరో ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్. సూర్య కూడా కేకేఆర్ జట్టు సభ్యుడు. గంభీర్ తన కెప్టెన్సీ సమయంలో సూర్యను వైస్ కెప్టెన్‌గా కూడా చేశాడు. ఇప్పుడు టీ20 జట్టుకు హార్దిక్ పాండ్యాను పక్కనపెట్టి సూర్యను కెప్టెన్‌గా చేశాడు.  

యువకులకు అవకాశం..

సూర్యకుమార్ యాదవ్ , శ్రేయాస్ అయ్యర్ తో పాటు రింకూ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, శుభ్‌మన్ గిల్ కూడా కేకేఆర్  తరపున ఆడారు. వీరు కూడా శ్రీలంక టూర్ కు ఎంపికయ్యారు . ఇందులో గంభీర్ పాత్ర ఉందనే వాదన వినిపిస్తున్నది. గిల్‌కు కెప్టెన్సీ అనుభవం లేకున్నా వైస్ కెప్టెన్‌గా నియమించారు.  హర్షిత్ రాణా ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన ఇచ్చాడు, కానీ అతను వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. జింబాబ్వే టూర్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ముఖేష్ కుమార్, అవేశ్ ఖాన్ జట్టుకు దూరమయ్యారు. దీంతో పాటు అభిషేక్ శర్మ, రితురాజ్ గైక్వాడ్‌లు కూడా టీ20 జట్టులోకి ఎంపిక కాలేదు.

Exit mobile version