JAISW News Telugu

Best Tourist Places : వరల్డ్ లోనే బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ లు భారత్ లోనే.. అవేంటో లుక్కేద్దాం..

Best Tourist Places

World’s Best Tourist Places in india to visit

Best Tourist Places : భారత్ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఇండియా అనే పేరున్నా.. భారత్ అని పిలుచుకునేందుకే భారతీయులు ఎక్కువగా ఇష్టపడతారు. టూర్ కు ఇక్కడ ఎక్కువగా ఆస్కారం ఉంది. ప్రపంచంలోని అత్యంత ఆధ్యాత్మికమైన దేశం భారత్. ఆ శేష హిమాలయం నుంచి కన్యాకుమారి వరకు ప్రతీ ప్రదేశంలో ఏదో ఒక అద్భుతం ఉండే ఉంటుంది.

సంస్కృతి సంప్రదాయాలకు నెలవుగా ఉన్న భారతదేశంలో ఆస్వాదించేందుకు అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ‘జాతీయ పర్యాటక దినోత్సవం’ సందర్భంగా భారత్ లోని టాప్ టూరిస్ట్ ప్లేస్ ల గురించి తెలుసుకుందాం.

అయోధ్య..
500 సంవత్సరాల తర్వాత శ్రీరాముడు అయోధ్యలో తన జన్మస్థలంలో కొలువయ్యాడు. 2019 కోర్టు తీర్పు అనంతరం దివ్య, భవ్య రామ మందిరం నిర్మించారు. జనవరి 22, 2024న ప్రాణ ప్రతిష్ఠ చేశారు. జగదబి రాముడిని దర్శించుకునేందుకు రెండు కన్నులు చాలవు. ఈ మందిరంలో చాలా విషయాలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని దర్శించుకోవాల్సిందే.

ఆగ్రా..
పాలరాయితో నిర్మించిన తాజ్ మహల్ కట్టడం ఇక్కడ ప్రత్యేకం. ఈ నిర్మాణం ప్రేమికులకు చిహ్నంగా షాజహాన్ తన భార్య ముంతాజ్ బేగం కోసం కట్టించాడు. ఆగ్రాకోట, ఫతేపూర్, సిక్రి తో పాటు నోరూరించే వంటకాలు ఇక్కడ ఫేమస్.

ఛండీగఢ్..
పంజాబ్ సంస్కృతి, ఆధునికత కలగలిసిన ఈ ప్రాంతం పర్యాటకంగా ఎంతో డెవలప్ సాధించింది. ఆహ్లాదకరమైన పార్కులు, మ్యూజియం, తదితరాలు ఇక్కడ ప్రత్యేకం. ఈ ప్రాంతాన్ని దర్శించుకోవాల్సిందే.

సిమ్లా..
హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా. ఇక్కడి టూరిజం భారత టూరిజంలో టాప్ 10లో నిలుస్తుంది. హనీమూన్ వెళ్లే జంటలు ఎక్కువగా సిమ్లా లాంటి ప్రదేశాలకు వెళ్తుంటారు. చూట్టూ కొండలు, గుట్టలతో చల్లటి వాతావరణం ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.

ఉదయ్ పూర్..
ఉదయ్ పూర్ ప్రాంతాన్నే ‘సిటీ ఆఫ్ లేక్స్’ అని ‘వెనిస్ ఆఫ్ ద ఈస్ట్’ అని కూడా పిలుస్తారు. అందమైన ఆరావళి కొండలు, చుట్టుముట్టి ఉంటాయి. చలికాలంలో అయితే దట్టమైన పొగ మంచుతో వీక్షించేందుకు ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడి ప్రదేశం.

ఢిల్లీ..
భారత్ కు రాజధాని అయిన ఢిల్లీ ఫుడ్ లవర్స్ కు ప్యారడైజ్ లాంటిది. చారిత్రక కట్టడాలు, గార్డెన్స్, పెద్ద పెద్ద యూనివర్సిటీలు చూడదగినవి. సాయంత్రం వేళ స్ట్రీట్ ఫుడ్ కోసం జనాలు గుంపులు, గుంపులుగా ఇక్కడి వీధుల్లోకి వస్తారు.

ఊటి..
బ్రిటీష్ వారి ఈస్టిండయా కంపెనీకి ఊటి హెడ్ క్వార్టర్స్ గా ఉండేది. ఆ తర్వాతి కాలంలో టూరిస్ట్ ప్లేస్ గా మారింది. ఇక్కడ ప్రశాంత వాతావరణం, ముఖ్యంగా హిల్ స్టేషన్లు ఎంతో ఆకట్టుకుంటాయి.

జైపూర్..
‘పింక్ సిటీ ఆఫ్ ఇండియా’గా జైపూర్ అభివృద్ధి చెందింది. పురాతన కట్టడాలు, కోటలు, వివిధ చేతి వృత్తుల ఉత్పత్తులు, అమోఘంగా ఉండే ఆహారంతో పర్యాటకులను ఇది స్వాగతం పలుకుతుంది.

గోవా..
విదేశీ పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తుంది గోవా. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో బీచ్ లలో ఎంజాయ్ చేసేందుకు వస్తుంటారు. దీనితో పాటు ఇక్కడ చర్చి అతి పురాతనమైనది. కాబట్టి క్రిస్టియన్ దేశాలకు చెందిన వారు ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు.

Exit mobile version