Juvenile Justice Board : మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరు టెకీల మృతికి కారణమైన బాలుడి (17) బెయిల్ ను జువైనల్ జస్టిస్ బోర్డు బుధవారం రద్దు చేసింది. వచ్చే నెల 5 వరకు అబ్జర్వేషన్ హోంలో ఉంచాలని ఆదేశించడంతో పోలీసులు అతడిని రిమాండ్ కు తరలించారు.
పూణెలో ఇద్దరు ఐటీ నిపుణుల మృతికి కారణమైన బాలుడిని గంటల వ్యవధిలోనే బెయిలు మంజూరు చేయడంపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. మహారాష్ట్రలోనూ బాధిత కుటుంబాలు, ప్రజల నుంచి ఆందోళనలు వ్యక్తం చేయడంతో న్యాయస్థానం దిగొచ్చింది. దీంతో బాలుడికి మంజూరు చూసిన బెయిల్ ను జువైనల్ జస్టిస్ బోర్డు రద్దు చేసింది.
12వ తరగతి ఫలితాల సందర్భంగా పూణెలోని పబ్బుల్లో స్నేహితులతో కలిసి మద్యం సేవించిన బాలుడు వాహనాన్ని నడుపుతూ బైక్ పై వెళ్తున్నవారిని ఢీకొట్టాడు. ఈ ఘటన పూణె కళ్యాణినగర్ ప్రాంతంలో రాత్రి 2.15 గంటల ప్రాంతంలో జరిగింది. బైక్ పై ఉన్న ఇద్దరు టెకీలు అక్కడికక్కడే మృతి చెందారు.