liquor shops : ఏపీలో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. దరఖాస్తుల గడువు ఈరోజుతో ముగియనుందని ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిషాంత్ కుమార్ తెలిపారు. శుక్రవారం రాత్రి 7 గంటల వరకు ఆన్ లైన్ లో నూతన రిజిస్ట్రేషన్ కు అవకాశం ఉంటుందన్నారు. రిజిస్ట్రేషన్ తదుపరి రాత్రి 12 గంటల్లోకా ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించాలన్నారు. బ్యాంకు డీడీలతో నేరుగా ఎక్సైజ్ స్టేషన్లలో దరఖాస్తులు సమర్పించేవారు రాత్రి 7 గంటల్లోపు క్యూలైన్ లో ఉంటేనే అవకాశం ఉంటుందన్నారు.
క్యూలైన్ లో ఉన్నవారికి టోకెన్లు అందించి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. దరఖాస్తుదారులు నిబంధనలు పాటించి కార్యక్రమం సజావుగా ముగిసేలా సహకరించాలని కోరారు. 3,396 మద్యం దుకాణాలకు ఇప్పటి వరకు 65,424 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.1,308 కోట్ల ఆదాయం సమకూరిందని నిషాంత్ కుమార్ తెలిపారు.