JAISW News Telugu

Anchor Suma : వివాదాల్లో యాంకర్ సుమ.. 26 లక్షలు నష్టపోయామంటూ బాధితుల ఆందోళన

Anchor Suma

Anchor Suma

anchor suma : తెలుగు తెరపై ప్రస్తుత టాప్ వన్ యాంకర్ అంటే ఠక్కున గుర్తొచ్చేది సుమ పేరే. తెలుగు సినిమా ఫంక్షన్ల వ్యాఖ్యాతగా ఇప్పటికే ఆమె పేరు తారాస్థాయికి చేరుకుంది. కేరళలో పుట్టినా ఆమె తెలుగులో ఎంతో చక్కగా మాట్లాడుతుందనే పేరు తెచ్చుకుంది. నటుడు రాజీవ్ కనకాల భార్యగానే కాకుండా ఆమెకంటూ తెలుగు సినీ వెండితెర, బుల్లితెరల్లో ప్రత్యేక స్థానాన్ని ఆమె సంపాదించుకుంది. ఇక ఆమె ఇటీవల పలు వివాదాల్లో కనిపిస్తున్నది. స్టేజీలపై తన మాటల ద్వారా కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవగా ఇఫ్పుడు తాను చేసిన ఓ యాడ్ రూపంలో ఆమెకు కొన్ని ఇబ్బందులు వచ్చి పడ్డాయి.

ఏపీలోని గోదావరి జిల్లా రాజమండ్రిలో ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ భారీ వెంచర్ వేసింది. అక్కడ భవన నిర్మాణాలను చేపట్టింది. ఇందుకోసం ప్రజలను ఆకర్షించేలా భారీ ప్రమోషన్స్ చేయించింది. చాలా మంది ఈ వెంచర్ లో ప్లాట్లను కొనుగోలు చేశారు.ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ వెంచర్ కు సుమ బ్రాండ్ అంబాసిండర్ గా కనిపించింది. ఇక కంపెనీ వ్యాపార ప్రకటనల్లో సుమ నటించింది. తక్కువ ధరకే ఇల్లు మీ సొంతం అంటూ ఉచిత సలహాలు ఇచ్చింది. దీంతో చాలా మంది డబ్బులు పోసి ఇక్కడ ఫ్లాట్లు కొన్నారు.

అయితే వారికి ఇచ్చిన సమయం ముగిసినా కంపెనీ ఓనర్లు ఫ్లాట్లను కొనుగోలుదారులకు అప్పగించలేదు. ఎన్నిసార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదు. దీంతో యజమానులపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.  నిరసనలకు దిగారు. ఈ సందర్భంగా బాధితులు యాంకర్ సుమపై విరుచుకుపడ్డారు. ఆమె ప్రచారం చేయడం వల్లే ఆకర్షితులమై ఈ వెంచర్ లో ఫ్లాట్లు కొన్నామని చెప్పారు. 26 లక్షల వరకు పెట్టుబడి పెట్టాం. యాంకర్ సుమ ఇందులో జోక్యం చేసుకొని తమ డబ్బులు ఇప్పించాలని కోరుతున్నారు.

Exit mobile version