Actress Divorce : ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త వేరే అమ్మాయితో ఎఫైర్.. చెంపదెబ్బ కొట్టి విడాకులిచ్చిన నటి
Actress Divorce : బుల్లితెరపై యూత్ లో ఫాలోయింగ్ పెంచుకున్న నటి జెన్నిఫర్ వింగేట్.. అయితే జెన్నిఫర్ వింగేట్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ మాయ అంటే మాత్రం ఎక్కువ మంది ఈజీగా గుర్తు పట్టేస్తారు. నటనలోనే కాదూ.. చూపులతో కూడా భయపెట్టగల సామర్థ్యం ఈ భామకు ఉంది.
కానీ ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలోనే కాదు.. క్రీడాకారుల లైఫ్ లో కూడా ఎక్కువ గా బ్రేకప్ లు విడాకుల వార్తలు వినిపిస్తున్నాయి. ప్రేమ అనుకుంటూ పెళ్లి చేసుకుంటున్నారు. కానీ కొన్ని రోజుల్లోనే విబేధాలు అంటూ విడిపోతున్నారు. అయితే ఈ సమయంలో చాలా మంది మరో పెళ్లి చేసుకుని సెటిల్ అవుతుంటే కొంతమంది మాత్రం సింగిల్ లైఫ్ నే గడుపుతున్నారు.
అయితే ఈ మాయ తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తకు వేరే అమ్మాయితో ఎఫైర్ ఉందని తెలిసింది. దీంతో తన ప్రియుడు, భర్తను అందరి ముందే చెంప దెబ్బ కొట్టి పరువు తీసేసింది. అనంతరం విడాకులు తీసుకుని ప్రస్తుతం ఒంటరి లైఫ్ గడుపుతుంది. మాయ పాత్రలో జెన్నిఫర్ స్టైల్, యాటిట్యూడ్, మేనరిజం చూసి ఆడియన్స్ ఆమె నటకు ఫిదా అయ్యారు.
హిందీలో దిల్ మిల్ గయే, బేహాద్, కహిన్ తో హోగా, బేపన్నా వంటి సీరియల్స్ ద్వారా జెన్నిఫర్ వింగేట్ చాలా పాపులర్ అయింది. చిన్న వయసులోనే నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ ను వివాహం చేసుకున్న ఈ భామ వీరిద్దరి పరిచయం సినిమా షూటింగ్ లోనే జరిగింది. వీరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. కానీ ఏడాదికే వీరు విడాకులు తీసుకున్నారు. 2014 లో వీరు విడాకులు తీసుకోగా.. అప్పటి నుంచి ఈ నటి ఒంటరిగానే జీవిస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి మోసం చేయడంతో ఇకపై పెళ్లి అంటేనే ఆమెకు విసుగు పుట్టిందని ఎవరీ నమ్మడం లేదని సినీ ఇండస్ట్రీ వర్గాల టాక్.. ఏమైనా మాయ మరో పెళ్లి చేసుకుని ఆనందంగా జీవించాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.