JAISW News Telugu

Rohit Sharma Wife : ‘‘అందుకే రోహిత్ ను మార్చాం..’’: కోచ్ బోచర్ కామెంట్స్ పై తీవ్రంగా స్పందించిన రోహిత్ శర్మ భార్య..

Rohit Sharma's wife reacted to coach Boucher's comments

Rohit Sharma’s wife reacted to coach Boucher’s comments

Rohit Sharma Wife : ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు దేశంలో ఎంత రగడ సృష్టించిందో అందరికీ తెలిసిందే. రోహిత్ ఫ్యాన్స్ తో మండిపోయి, హార్దిక్ ను, ముంబై ఇండియన్స్ ను ఓ రేంజ్ లో వేసుకున్నారు. జట్టుకు 5 టైటిళ్లను అందించిన రోహిత్ శర్మ కు బదులు హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా నియమించడం ఫ్యాన్స్ ను షాక్ కు గురిచేసింది. తాజాగా ఈ అంశంపై ఆ జట్టు కోచ్ మార్క్ బోచర్ స్పందిస్తూ మార్పు వెనుక అసలు కారణాన్ని వెల్లడించారు.

ఓ క్రీడా చానల్ పాడ్ కాస్ట్ లో కోచ్ మార్క్ దీనిపై మాట్లాడుతూ.. ఇది పూర్తిగా ఆటపరంగా తీసుకున్న నిర్ణయమేనని, తన వరకు ఇదో పరివర్తన దశ మాత్రమే అన్నారు. చాలా మందికి ఈ విషయం అర్థం కాక, ఫుల్ ఎమోషనల్ అయ్యారని చెప్పారు. కానీ ఆటకు సంబంధించిన విషయాల్లో భావోద్వేగాలను పక్కకుపెట్టాలన్నారు. ఓ ఆటగాడిగా రోహిత్ నుంచి మరింత అత్యుత్తమ ప్రదర్శన చూసేందుకు ఈ నిర్ణయం మేలు చేస్తుందన్నారు. అతడు మరింత స్వేచ్ఛతో ఆడి మంచి పరుగులు సాధిస్తాడన్నారు.

ఇక ఐపీఎల్ లో క్రికెటేతర బాధ్యతలు కూడా కెప్టెన్సీ మార్పునకు మరో కారణమని మార్క్ వెల్లడించారు. ‘‘గత రెండు ఐపీఎల్ సీజన్లలో రోహిత్ బ్యాట్ తో రాణించలేకపోయాడు. అందుకే అతడి భుజాలపై బాధ్యతలను తగ్గించాలనుకున్నామన్నారు. లీగ్ టోర్నీలో కెప్టెన్ కు ఆట కాకుండా చాలా బాధ్యతలుంటాయన్నారు. ఫొటో షూట్స్, ప్రకటనల వంటివి కూడా చూసుకోవాలన్నారు.

కాగా.. ఈ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూ పై రోహిత్ భార్య రితికా విమర్శనాత్మక పోస్ట్ చేశారు. ‘‘దీని వల్ల చాలా తప్పిదాలు జరిగాయి’’ అంటూ ఆమె పేర్కొనడం ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీసింది.

Exit mobile version