JAISW News Telugu

Casio వాచ్ అందుకే ధరిస్తా..ఐకాన్ స్టార్ ఇంకా ఏం చెప్పాడంటే..

Casio Watch

Allu Arjun Casio Watch

Casio Watch : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..స్టైలిష్ కు మారుపేరు. పుష్ప మూవీతో పాన్ ఇండియన్ స్టార్ గా విశేష అభిమానులను సంపాదించుకున్నాడు. ఆ సినిమాలో తన అద్భుత నటనతో ఉత్తమ జాతీయ నటుడు అవార్డును సైతం అందుకున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే పుష్ప సినిమా అల్లు అర్జున్ ఇమేజ్ ను దేశ స్థాయిలో నిలిపింది. ఇక ఫ్యాషన్ లో  అల్లు అర్జున్ ను మించినవారు లేరు. మిగతా హీరోలకు మించి డ్రెస్సింగ్స్ , హేర్ స్టైల్..ఇలా చెప్పుకుంటూ పోతే అల్లు అర్జున్ ఏదీ వాడినా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయిపోతుంటుంది. ఆ కోవలోనిదే ఆయన ధరించే వాచ్.

అల్లు అర్జున్ ఎక్కువగా ‘casio’ వాచ్ లు ధరించడానికి గల కారణాన్ని వెల్లడించారు. తెలంగాణలో జరిగిన లోక్ సభ ఎన్నికల పోలింగ్ సమయంలో ఆయన casio వాచ్ ధరించగా..దీనికి ఓ నెటిజన్ ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ..‘ఈ వాచ్ సమయం మాత్రమే చూపించదు. మనం ఎక్కడి నుంచి వచ్చామో గుర్తుచేస్తుంది’ అని రిప్లై ఇచ్చారు.

దీంతో ‘casio’ వాచ్ పై నెట్టింట్లో తీవ్ర చర్చ నడుస్తోంది.   కాసియోలో అంత ప్రత్యేకత ఏముందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే నిపుణులు ఏమంటున్నారంటే..కాసియో సాధారణంగా మన్నికైన, నమ్మదగిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తయారు చేయడానికి ప్రసిద్ధి చెందింది. కాసియో ఒక ఫ్యాషన్ చిహ్నంగా మారింది. ప్రపంచంలోని అత్యంత ధనవంతులు ఈ వాచ్ లను ధరిస్తారు. కాసియో గడియారాలు కచ్చితమైన సమయాన్ని చూపుతాయి.

Exit mobile version