Pawan Kalyan : సెలబ్రిటీలకు విడాకులు చాలా కామన్ అయిపోయాయి. తమ లైఫ్ పార్టనర్ తో రాజీ పడకపోవడం, పెళ్లి తర్వాత కెరీర్ కొనసాగించడం, పర్సనల్ లైఫ్ ను మెయింటెన్ చేయడం మొదలగు కారణాలతో విడాకులు తీసుకుంటున్నారు. తాజాగా ఓ సీరియల్ నటుడు తన భార్యకు విడాకులు ఇవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఓ నటితో ఎఫైర్ కారణంగానే అతడు తన భార్యకు విడాకులు ఇచ్చాడనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.
ముద్దమందారం సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు పవన్ సాయి. మధుమిత అనే అమ్మాయిని వివాహం చేసుకున్న పవన్ కు ఓ బాబు కూడా ఉన్నాడు. తాజాగా పవన్ తన వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పారు. తన భార్య మధుమితకు విడాకులు ఇచ్చానని పవన్ ఓ పోస్టును షేర్ చేశాడు.
‘‘ నా వ్యక్తిగత, వైవాహిక జీవితం గురించి ఏదేదో మాట్లాడుకుంటున్నారు. వాటన్నంటికీ నేను ఈ రోజు క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాను. నేను, మధుమిత ఇద్దరి ఇష్టంతోనే చాలా కాలం క్రితం విడాకులు తీసుకుని విడిపోయాం. ఇప్పుడు మా జీవితాలు మేం బతుకుతున్నాం. ఏదేమైనా సరే ఇప్పటికీ ఒకరికి ఒకరం సపోర్టివ్ గా ఉంటున్నాం. ఎవరూ దీని గురించి ఆందోళన చెందవద్దు. నేను నా వ్యక్తిగత విషయాలను పంచుకోవడానికి పెద్దగా ఇష్టపడను. కాబట్టి దయచేసి మా నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నా’’ అంటూ ఆ పోస్ట్ ను షేర్ చేశాడు.
అయితే ఈ విషయం బుల్లితెరపై హాట్ టాపిక్ మారింది. పవన్ విడాకులపై ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. ఓ నటితో ఎఫైర్ వల్లనే విడాకులు ఇచ్చారని కొందరంటున్నారు. మరికొందరు అతడి పర్సనల్ విషయాలను మనకెందుకు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఎవరి లైఫ్ వాళ్లదేనని, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం సరికాదు అంటున్నారు.