Actress Shakeela : ఒకప్పుడు తన సినిమాలతో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలింది షకీలా. రీసెంట్ గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షోలో కూడా పాల్గొంది. అయితే రెండో వారంలోనే ఎలిమినేట్ అయ్యింది. ఆ తర్వాత ఆమె ఎక్కడా కనిపించలేదు. తాజాగా ఓ అబ్బాయితో కనిపించి సందడి చేసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు కంటెస్టెంట్ల అందరితో షకీలా ఒక పెద్దక్కలా సంతోషంగా గడిపింది. టేస్టీ తేజతోనూ చాలా చనువుగా ఉండేది. తాజాగా టేస్టీ తేజకు ఓ ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది. అందులో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
షకీలా ఇప్పటివరకు పెళ్లి ఎందుకు చేసుకోకపోవడానికి కారణం చెప్పింది. తన కుటుంబ సభ్యుల కోసం మాత్రమే పెళ్లి చేసుకోకుండా ఉండిపోయానని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులే తనను ఒంటరి దాన్ని చేశారని.. ఇప్పుడు ఒంటరిగా గడుపుతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు 34 ఏండ్ల వయస్సు ఉండగా తన తల్లి చనిపోయిందని.. అంతకుముందు తల్లి తరుచుగా కుటుంబం కోసం తనను సినిమాలు చేయమనేది అని షకీలా చెప్పుకొచ్చింది. అలాగే తల్లి చనిపోయిన తర్వాత కొంతకాలానికే తన అన్నయ్య చనిపోయాడని తెలిపింది. వారు కుటుంబ బాధ్యతను తానే తీసుకున్నానని చెప్పింది. డబ్బులు ఇవ్వాలి కానీ పిల్లలను తన వద్ద ఉంచుకోవద్దని వదిన, ఆమె తరుఫు బంధువులు గొడవ చేశారని, అలా వాళ్లు దూరం అయ్యారని వెల్లడించింది.
ఆ తర్వాత తన అక్క కూడా దూరమైందని, ప్రస్తుతం ఒంటరిగా జీవిస్తున్నానని చెప్పింది. అయితే తాను చాలా మందికి సాయం చేస్తున్నానని, ముఖ్యంగా ట్రాన్స్ జెండర్లకు షెల్టర్ ఇస్తున్నానని, వారిని పోషించడం, కొందరికి పెళ్లిళ్లు కూడా చేశానని తెలిపింది. వాళ్లందరికీ తల్లిగా తాను బాధ్యతలు స్వీకరిస్తున్నానని చెప్పింది.