Rohit Sharma : అందుకే t20 లకు కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించాడట

Rohit Sharma

Rohit Sharma

Rohit Sharma : వెస్టిండీస్ లోని బార్బర్ డోస్ లో జరిగిన టి20 ప్రపంచ కప్ లో భారత్ విశ్వ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. టి20 భారత కెప్టెన్ రోహిత్ శర్మ తాను టి20 ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు చెప్పాడు.  అయితే ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా దానికి తాజాగా వివరణ ఇచ్చాడు. టి20 మ్యాచ్ల్లో 17 సంవత్సరాలుగా పాల్గొన్నా..  కొత్త వాళ్లకు కూడా అవకాశం ఇవ్వాలి అనుకున్న లక్ష్యం నెరవేరింది. టి20 ప్రపంచ కప్ ను మరోసారి అందుకున్నాను.
 ముఖ్యంగా కెప్టెన్ గా అందుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది ఇంతకంటే మంచి సమయం రిటైర్ కావడానికి మరేమిటి ఉంటుందని చెప్పాడు. అందుకే ప్రపంచ కప్ గెలవగానే వెంటనే t20 ల నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు చెప్పానని తెలిపాడు. రోహిత్ శర్మ టి20 ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియాపై విరుచుకుపడి బీభత్సమైన ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు.
 అందరికీ ఆస్ట్రేలియా భయం ఉన్నట్టే ఇండియాకి కూడా ఆస్ట్రేలియా ఫైనల్ చేయకూడదని ముందు నుంచి అనుకున్నారు. అదే ప్లాన్ లో భాగంగా ఆస్ట్రేలియా అను ఓడించి సెమిస్ కూడా చేరకుండా చేయడంలో భారత్ విజయవంతం అయింది. అందులో రోహిత్ శర్మ పాత్ర వెలకట్టలేనిది. రోహిత్ ఆస్ట్రేలియాపై దంచి కొట్టాడు. మిచెల్ స్టార్ కు బౌలింగ్ లో  ఒకే వారిలో దాదాపు 30 పరుగులు రాబట్టాడు. నాలుగు సిక్సులు ఒక ఫోర్ తో వీర విహారం చేశాడు.
స్కోరు బోర్డుని పరుగులు పెట్టించాడు. రోహిత్ శర్మ ఇలా ఆడడంతో ఆశిష్ పై గెలిచి తద్వారా తర్వాతి మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా పై ఫైనల్ లో గెలిచి టి20 ప్రపంచ కప్ ని ముద్దాడింది. ఇలా రోహిత్ శర్మ తన 17 ఏళ్ల  టి20  ఫార్మాట్ కు వీడ్కోలు పలికాడు. మొత్తం మీద రోహిత్ శర్మ కెప్టెన్ గా ప్రపంచకప్ అందుకొని రిటైర్మెంట్ ప్రకటించడం చాలా సంతోషకరమని అతడి అభిమానులు ఉప్పొంగిపోతున్నారు. రోహిత్ ఇస్ ద బెస్ట్ కెప్టెన్ అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
TAGS