Anchor Anasuya : అనసూయ అందుకే జబర్ధస్త్ నుంచి వెళ్లిపోయింది.. అసలు విషయం బయటపెట్టిన ఆది!

Jabardhast Anchor Anasuya and Hyper Adi
Anchor Anasuya left Jabardhast : మల్లెమాల ప్రొడక్షన్ హౌజ్ ఈటీవీలో కామెడీ షో జబర్ధస్త్ ప్రారంభించినప్పటి నుంచి అనసూయ భరద్వాజ్ యాంకర్ గా చేస్తుంది. షోతో ఆమెకు, ఆమెతో షోకు బాగా పాపులారిటీ వచ్చింది. ఇలా సాఫీగా సాగుతుండగా 2022లో ఒక్కసారిగా షో నుంచి తప్పుకుంది అనసూయ. అప్పుడు కారణం తెలియలేదు. కానీ ఇటీవల హైపర్ ఆది అసలు కారణం బయటపెట్టాడు.
2013లో జబర్ధస్త్ కామెడీ షోను ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. నాగబాబు, రోజా జడ్జిలుగా, కొందరు కమేడియన్స్ టీమ్ లీడర్స్ గా మొదలైంది. తక్కువ కాలంలోనే విస్తృతంగా పాపులారిటీ సంపాదించుకుంది. మొదటి ఎపీసోడ్ నుంచే అనసూయ యాంకర్ వచ్చింది.
పొడుగ్గా.. అందమైన శరీరం ఉన్న ఆమె గ్లామర్ ను పంచుతూ యాంకర్ గా ఆడియన్స్ ని కట్టిపడేసింది. తెలుగు ఇండస్ట్రీలో యాంకర్స్ స్కిన్ షో చేయడం అనే కాన్సప్ట్ అనసూయనే పరిచయం చేసింది. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో సంచలనాలు సృష్టించింది.
ఈ షో ద్వారా విపరీతమైన ఫేమ్ రాబట్టింది. దీంతో ఆమెకు వెండితెరపై కూడా ఆఫర్స్ రావడం ప్రారంభమయ్యాయి. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు, స్టార్స్ చిత్రాల్లో లీడ్ రోల్స్ దక్కాయి.
వీటన్నింటి నేపథ్యంలో 2022లో అనసూయ జబర్ధస్త్ ను పక్కన పెట్టింది. డేట్స్ అడ్జస్ట్ కావడం లేదని, అందుకే జబర్ధస్త్ ను వీడుతున్నట్లు అనసూయ అప్పట్లో చెప్పుకచ్చింది. కానీ, అసలు కారణం మరోటి ఉందనేది ఓపెన్ సీక్రెట్.
షో నుంచి వెళ్లిపోయి సినిమాల్లో యాక్టింగ్ చేస్తున్న క్రమంలో షోపై ఆమె కొన్ని ఆరోపణలు చేసింది. జబర్దస్త్ కమెడియన్స్ తనపై బాడీ షేమింగ్ కి పాల్పడ్డారని, కొన్ని సార్లు అది తీవ్రరూపం దాలుస్తుందని, చాలా సార్లు ఎడిటింగ్ లో కొన్ని తీసేశారని అనసూయ ఆరోపణలు చేసింది. ఇక, మరో సందర్భంలో టీఆర్పీ స్టంట్స్ నచ్చకే వెళ్లానని చెప్పింది.
జోర్దార్ సుజాత రీసెంట్ గా హైపర్ ఆదిని ఇంటర్వ్యూ చేసింది. ఇందులో భాగంగా మీ వల్లే అనసూయ జబర్ధస్త్ నుంచి వెళ్లిందని బయట టాక్ దీనిపై మీ సమాధానం? అంటూ ప్రశ్నించింది. దీంతో హైపర్ ఆది సీరియస్ గా ముఖం పెట్టి ఏదో చెప్పాడు.
అయితే ప్రోమోలో అదేంటనేది రివీల్ కాలేదు. ఇంటర్వ్యూ పూర్తి ఎపీసోడ్ బయటకు వస్తే గానీ అసలు విషయం తెలుస్తుంది. హైపర్ ఆది టీమ్ లీడర్ అయ్యాక అనసూయ మీద వేసే పంచులు ఆయన షో విన్నర్ అయ్యేందుకు దోహదం చేశాయనడంలో ఎలాంటి సందేహం లేదు.