Glenn Maxwell : ఐపీఎల్ నుంచి వైదొలిగిన మ్యాక్స్ వెల్.. షాకింగ్ నిర్ణయం వెనుక కారణం అదే
Glenn Maxwell : మానసికంగా, శారీరకంగా అలసిపోయిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఐపీఎల్-2024 నుంచి కొద్దికాలం పాటు దూరమయ్యాడు. మ్యాక్స్ వెల్ ఆడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఆర్సీబీ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క దాంట్లోనే విజయం సాధించింది. విరామం కారణంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌కు మ్యాక్స్‌వెల్‌ను ఎంపిక చేయలేదు. ఈ టీ20 టోర్నీ ఆరంభం నుంచి మ్యాక్స్‌వెల్‌కు కలిసి రావడం లేదు. అతను 6 ఇన్నింగ్స్‌లలో కలిపి మొత్తంగా 32 పరుగులు మాత్రమే చేశాడు, ఇందులో మూడు మ్యాచ్ లలో ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ బాట పట్టాడు.
మరొకరికి అవకాశం ఇవ్వాలని..
సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తాను సానుకూలంగా రాణించలేనని భావించిన మ్యాక్స్ వెల్ తానే స్వయంగా వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. ‘కొన్ని ప్రారంభ మ్యాచ్‌లు వ్యక్తిగతంగా తనకు కలిసి రాలేదు. కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. గత మ్యాచ్ తర్వాత కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్‌తో పాటు కోచ్‌లతో మాట్లాడి మరో ప్లేయర్ కు అవకాశం ఇవ్వాలని కోరాడు. మానసికంగా, శారీరకంగా విశ్రాంతి తీసుకోవడానికి ఇదే సరైన సమయమని మ్యాక్స్ వెల్ చెప్పాడు
మాక్స్‌వెల్ మాట్లాడుతూ ..
జట్టు ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటే ఈ నిర్ణయం చాలా సులభం. మా బృందం అంచనాలకు తగ్గట్టుగా నేను రాణించలేకపోతున్నాను. ఫలితాలు కూడా ప్రతికూలంగా వస్తున్నాయి. నా వ్యక్తిగత ప్రదర్శన కూడా జట్టు ప్రదర్శన తీరును ప్రతిబింబిస్తుంది. గత కొన్ని సీజన్లలో పవర్‌ప్లే, మిడిల్ ఓవర్లలో చాలా బాగా రాణించాం. కానీ ఈసారి చాలా లోపాలు ఉన్నాయి. నేను జట్టుకు సానుకూలమైన సహకారం అందించలేకపోతున్నానని భావించాను. మరో ప్లేయర్ కి అవకాశం ఇస్తే సరి. తన స్థానంలో కొత్త ప్లేయర్ మంచి ప్రదర్శన చేసే అవకాశం ఉందని ఆశిస్తున్నట్ల మ్యాక్స్ వెల్ చెప్పాడు.
లీగ్‌లోకి పునరాగమనంపై పూర్తి ఆశ
మానసికంగా, శారీరకంగా పూర్తిగా కోలుకున్నాక మళ్లీ సిద్ధమవుతానని మాక్స్‌వెల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కానీ ఫామ్‌లో లేనప్పుడు నా నుంచి ఆశించిన పరుగులు రావడం లేదు. టోర్నీకి ముందు ఆరు నెలలు నా క్రికెట్ కెరీర్‌లో కొన్ని అత్యుత్తమ కాలం. కానీ ఇప్పుడు పరిస్థితులు నన్ను పూర్తిగా నిరాశపరిచింది. నేను నా శరీరాన్ని, మనస్సును సరిగ్గా ఉంచుకుంటే, నాకు మళ్లీ అవకాశం లభిస్తే, టోర్నమెంట్‌ను ఉన్నత స్థాయిలో ముగించే అన్ని అవకాశాలు ఉన్నాయని చెప్పారు.