Rohit Sharma : రోహిత్ తో పెట్టుకుంటే అంతే.. ఆసిస్ కు, ఇంగ్లండ్ కు ఇచ్చిపడేసిన కేప్టెన్..
Rohit Sharma : T20 ప్రపంచకప్-2024లో టీమిండియా దూసుకుపోతోంది. బ్రేకుల్లేని బండిలా.. ప్రత్యర్థి ఎవరున్నా తొక్కుకుంటూ పోతోంది. అపజయమనే మాట ఎరుగకుండా ఫైనల్ వరకు దూసుకెళ్లింది. ఇంగ్లండ్‌తో జరిగిన వన్ సైడ్ మ్యాచ్ లో భారత్ 68 పరుగుల తేడాతో విజయం సొంతం చేసుకుంది.
ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ను ఎంచుకుంది. దీంతో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ కు దిగింది. రోహిత్ శర్మ (39 బంతుల్లో 2 సిక్స్ లు, 6 ఫోర్లతో 57), సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 2 సిక్స్ లు, 4 ఫోర్లతో 47), హార్దిక్ పాండ్యా (13 బంతుల్లో 2 సిక్స్ లు, ఒక ఫోర్ తో 23) బ్యాటింగ్ తో మెరుపులు మెరిపించారు. ఇక, బౌలర్లు అక్షర్ పటేల్(3/23), కుల్దీప్ యాదవ్(3/19), బుమ్రా (2/12)తో విజయాన్ని మరింత సులువు చేశారు.
172 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ను భారత స్పిన్నర్ల వేగంగా కట్టడి చేశారు. 16.4 ఓవర్లు వేసి 103 పరుగులు ఇచ్చి ఇంగ్లండ్ ను కుప్ప కూల్చారు. జోస్ బట్లర్(15 బంతుల్లో 4 ఫోర్లతో 23), హ్యారీ బ్రూక్ (19 బంతుల్లో 3 ఫోర్లతో 25) టాప్ స్కోరర్లుగా ఉండగా.. మిగతా బ్యాట్స్ మన్లు దారుణంగా విఫలం అయ్యారు.
భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీతో దుమ్ము లేపాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లెక్కలు సరిచేశాడు. తన సూపర్ పవర్ బ్యాటింగ్‌తో రోహిత్ కొన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
దీంతో.. T20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన తొలి భారత కెప్టెన్‌గా రోహిత్ గుర్తింపు పొందాడు. 2007, T20లో ధోని చేసిన 36 పరుగులే హయ్యస్ట్ స్కోర్ కాగా.. ఇప్పుడు దాన్ని బీట్ చేశాడు రోహిత్ శర్మ.
సిక్సర్ల మొనగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు. T20 వరల్డ్ కప్ హిస్టరీలోనే అధిక సిక్స్‌లు కొట్టిన ఫస్ట్ భారత బ్యాటర్‌గా రోహిత్ రికార్డుల మోత మోగించాడు. T20 వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు రోహిత్ శర్మ 50 సిక్స్‌లు చేశాడు. 63 సిక్సర్లతో గేల్ టాప్ ప్లేసులో కొనసాగుతున్నాడు.
దీంతో.. రోహిత్ ను ఫ్యాన్స్ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ‘ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌కు గట్టిగా ఇచ్చి పడేసినవ్ అన్నా..’ ఇదే జోరుతో సౌతాఫ్రికాపై చెలరేగి టీమ్ ఇండియాకు కప్ తీసుకురా అని కామెంట్లు పెడుతున్నారు.