Varma : లేటయింది అంతే..  కానీ వర్మను విడిచి పెట్టలేదు

Varma

Varma

Varma Notice : రాజకీయ నేతల పరువు తీసేలా సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెడుతూ  మార్ఫింగ్ ఫొటోలతో పాటు అనుచిత వ్యాఖ్యలు చేసి సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్న వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో ఏపీ పోలీసు శాఖ క్షేత్రస్థాయిలో తన దూకుడు పెంచింది. ఇప్పటికే కొందరిపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారు. మరికొందరిపై చర్యలు తీసుకున్నారు. పలువురు వైసీపీ సోషల్‌ మీడియా ప్రతినిధులు ఇంటూరి రవికిరణ్‌, బోరుగడ్డ అనిల్‌కుమార్‌ అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత నారా లోకేష్, ఆయన సతీమణి నారా బ్రాహ్మణి వంటి వ్యక్తులను కించపరుస్తూ పోస్టులు పెట్టినందుకు ఇటీవల దర్శకుడు రాంగోపాల్ వర్మ(ఆర్జీవీ)పై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

సినీ దర్శకుడు ఆర్జీవీ పై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో ఐటీ చట్టం కింద కేసు నమోదైంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, బ్రాహ్మణి తమ వ్యక్తులను కించపరుస్తూ పోస్టులు పెట్టారని ఆయనపై ఫిర్యాదు నమోదైంది. ఆర్జీవీపై టీడీపీ మద్దిపాడు మండల ప్రధాన కార్యదర్శి రామలింగం సమీప స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు రాంగోపాల్ వర్మపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ  రైతు విభాగం ఉపాధ్యక్షుడు నూతలపాటి రామారావు ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్శకుడు వర్మపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఆర్జీవీపై తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆ కేసులో విచారణకు హాజరుకావాలంటూ ఆర్జీవీకి నోటీస్‌ ఇచ్చేందుకు ఏపీ పోలీసులు బుధవారం హైదరాబాద్‌ చేరుకున్నారు. ఇన్నళ్ల పాటు ఆర్టీవీ మౌనంగా ఉన్నప్పటికీ ఇప్పటికి వర్మకి ముహూర్తం పెట్టారన్న మాట. వైసీపిలో రెచ్చిపోయినవారందరి పరిస్థితి ఏమవుతోందో ఇది చూస్తుంటే అర్థం అవుతుంది. మరో వైపు పోసాని కృష్ణ మురళి మళ్లీ  మొదలుపెట్టేశారు. అంటే తన సంగతి పోలీసులు మరిచిపోయారనుకున్నారో ఏమో? పోలీసులు పోసానిని కూడా పలకరించడానికి కాస్త ఆలస్యం అవుతుందేమో కానీ పలకరించడం మాత్రం పక్కా !

TAGS