Keshineni Nani : విశాఖలో ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు ప్రభత్వం 60 ఎకరాలు కేటాయించడాన్ని విజయవాడ మాజీ ఎంపీ, వైసీపీ నేత కేశినాని నాని తప్పుబట్టారు. అది విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని బినామీ కంపెనీ అని ఆరోపించారు. రూ.5,728 కోట్ల ప్రాజెక్ట్ హ్యాండిల్ చేసే అనుభవం, క్రెడిబిలిటీ ఆ సంస్థకు లేదన్నారు. వెంటనే భూ కేటాయింపులు రద్దు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు.