BCCI in Trouble : ఆ రుజువు ఐసీసీకి ఇవ్వాల్సిందే.. బీసీసీఐని ఇరకాటంలో పడేసిన పీసీబీ
BCCI in Trouble : వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు సంబంధించి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రస్తుతం టెన్షన్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తమ జట్టును పాకిస్థాన్‌కు పంపకూడదని నిర్ణయించడం. తాజాగా బీసీసీఐ తమ జట్టును పాకిస్థాన్‌కు పంపేది లేదని మరోసారి స్పష్టం చేసింది. ఇప్పుడు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు బీసీసీఐని లిఖితపూర్వకంగా కోరింది. భద్రతా కారణాల దృష్ట్యా టీమ్ఇండియా పాకిస్థాన్‌కు వెళ్లేందుకు భారత ప్రభుత్వం నిరాకరించిందని, అందుకు బీసీసీఐ లిఖితపూర్వకంగా ఆధారాలు ఇవ్వాలని పీసీబీ పేర్కొంది. ఈ విషయాన్ని పీసీబీ వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో టోర్నీ జరగనున్నందున, సమస్యను త్వరగా పరిష్కరించాలని ఆతిథ్య బోర్డు కోరుతోంది.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) వార్షిక సమావేశం జూలై 19న కొలంబోలో జరగనుంది. దాని ఎజెండాలో ‘హైబ్రిడ్ మోడల్’ లేదు. అంటే ఈ సమావేశంలో ‘హైబ్రిడ్ మోడల్’పై చర్చ జరగనుంది. ఇందులోభాగంగా భారత జట్టు తన మ్యాచ్‌లను యూఏఈలో ఆడనుంది. భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వకుంటే రాతపూర్వకంగా ఇవ్వాల్సి ఉంటుందని, బీసీసీఐ వెంటనే ఆ లేఖను ఐసీసీకి ఇవ్వాలని పీసీబీ వర్గాలు తెలిపాయి. టోర్నీ కోసం పాకిస్థాన్‌కు వెళ్లే జట్టు గురించి 5-6 నెలల ముందుగానే బీసీసీఐ ఐసీసీకి లిఖితపూర్వకంగా తెలియజేయాలని తెలిపింది.
పాకిస్తాన్లో ఆడాలనేది ప్రభుత్వ నిర్ణయం అని BCCI ఎప్పటినుంచో చెబుతోంది. 2023 ODI ఆసియా కప్‌లో కూడా, భారత్ మ్యాచ్‌లు శ్రీలంకలో హైబ్రిడ్ మోడల్లో నిర్వహించారు. ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ముసాయిదాను పిసిబి ఐసిసికి సమర్పించింది. ఇందులో భారత్ అన్ని మ్యాచ్‌లు, సెమీ-ఫైనల్, ఫైనల్ లాహోర్‌లో జరుగుతాయి. మార్చి 1న భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది.
టోర్నమెంట్ ఫిబ్రవరి 19న కరాచీలో ప్రారంభమవుతుంది. ఫైనల్ మార్చి 9న లాహోర్‌లో జరుగుతుంది. ఫైనల్స్‌లో ఒకరోజు రిజర్వ్ ఉంటుంది. టీమిండియాను పాకిస్థాన్‌కు పంపే విషయమై భారత ప్రభుత్వం కానీ, బీసీసీఐ కానీ ఎలాంటి చర్చలు జరపలేదని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. అయితే టీమ్ ఇండియా పాక్ వెళ్లడం అనుమానమే అని అంటున్నారు. భారత్ పాకిస్థాన్‌కు వెళ్లే బదులు హైబ్రిడ్ ఫార్మాట్లో టోర్నీ నిర్వహించాలని బీసీసీఐ కోరినట్లు సమాచారం.