AP Latest Survey : ఏపీలో అధికారంలోకి వచ్చేది ఆ పార్టే.. తాజా సర్వేలో సంచలన విషయాలు..
AP Latest Survey : ఏపీలో ప్రధాన పార్టీలు బిజీబిజీ అయిపోయాయి. అభ్యర్థులను దాదాపు ప్రకటించిన పార్టీలు ఇక ప్రచారబరిలోకి దిగబోతున్నాయి. వైసీపీ అధినేత జగన్ బస్సు యాత్ర ద్వారా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు పర్యటించనున్నారు. జగన్ ను గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ తగిన వ్యూహాలు రచిస్తున్నాయి. మరి ప్రజల మదిలో ఏ పార్టీ ఉంది? సీఎంగా ఏ నాయకుడిని చేద్దామనుకుంటున్నారు..అనే విషయంపై ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అనే సంస్థ ఓ సర్వే నిర్వహించింది. 175 నియోజకవర్గాల్లో 2,24,500 మంది ఓటర్ల మనోగతాన్ని తెలుసుకుంది.
ప్రభుత్వ పాలన, స్థానిక ఎమ్మెల్యే పనితీరు, నియోజకవర్గంలో ఉన్న రాజకీయ స్థితిగతులు, మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలు..వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని సర్వే ఫలితాలను వెల్లడించింది.
ఈ సర్వే ప్రకారం ఏపీలో మరోసారి వైసీపీ విజృంభణ ఖాయమని తెలిపింది. 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని చెప్పింది. టీడీపీ కూటమికి 44 స్థానాలు వస్తాయని, మిగిలిన 11 నియోజకవర్గాల్లో వైసీపీ, కూటమి అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు ఉంటుంది. వైసీపీకి 50.1శాతం మేర ఓట్లు పోల్ అవుతాయి. ఇది 2019 కంటే అధికం. టీడీపీ కూటమికి పడే ఓట్ల శాతం 47.2 ఇతరులకు 2.7శాతం మేర ఓట్లు పడుతాయి.
అలాగే లోక్ సభ స్థానాల్లో వైసీపీ 18 సీట్లు గెలుస్తుందని అంచనా వేసింది. టీడీపీ కూటమి 2 స్థానాలే గెలుస్తుందని తెలిపింది. మిగిలిన 5 చోట్ల వైసీపీ, టీడీపీ కూటమి మధ్య తీవ్ర పోరు ఉంటుందని చెప్పింది. కాగా, ముందస్తు అంచనాలు, సర్వేలు ఎంత వరకు నిజం అవుతాయో జూన్ 4వ తేదీనే తేలనుంది.