NDTV Survey : ఏపీలో ఆ పార్టీదే విజయం.. ఎన్డీటీవీ సర్వేలో మరో విషయం..
NDTV Survey : దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సందడి కొనసాగుతోంది. మొదటి దశ పోలింగ్ కూడా శుక్రవారం (ఏప్రిల్ 19) రోజున ఉంది. ఓటరు నాడి తెలుసుకునేందుకు సర్వే సంస్థలు, జాతీయ, ప్రాంతీయ మీడియా ఛానళ్లు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సర్వే ఫలితాలు ఏపీ రాజకీయ పరిస్థితిపై తమ ఒపీనియన్ పోల్స్ వెల్లడించాయి. వాటిలో మెజారిటీ ఫలితాలు వైసీపీ వైపే జై కొట్టాయి.. మరోమారు ఏపీలో జగన్ పాలన వస్తుందని తెలిపాయి.
ఎన్నికలు సీజన్ వచ్చిందంటే చాలు ఆయా పార్టీలు, నేతలు, కార్యకర్తలు ఎంతటి సందడి చేస్తారో సర్వే సంస్థలు కూడా అంతే సందడి చేస్తాయి. ఏపీలో జరిగే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలపైనా సర్వే సంస్థలు తమ అంచనాలను వెల్లడించాయి. ఈ నేపథ్యంలో.. వివిధ సర్వేలను కలిపి రూపొందించిన ఎన్డీటీవీ పోల్ ఆఫ్ పోల్స్ రిపోర్ట్ తాజాగా రిలీజ్ చేశారు.
ఈ ‘పోల్ ఆఫ్ పోల్స్’లో ఏబీపీ, జీ-న్యూస్, టైమ్స్, ఇండియా టీవీ వంటి ఛానళ్లు ఇచ్చిన సర్వేల్ని కలిపి ఎన్డీటీవీ ఫలితాలను వెలువరించింది. ప్రధానంగా ఏపీలో మరోసారి ఫ్యాన్ గాలి వీస్తుందని వెల్లడించింది. ఈ క్రమంలో టీడీపీ+బీజేపీ+జనసేన కూటమిగా కలిసి పోటీచేసినా విజయం జగన్ నే వరిస్తుందని వెల్లడించింది.
లోక్ సభ ఎన్నికల్లో వైసీపీకి 16 సీట్లు, కూటమికి 9 స్థానాలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ ప్రభావం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లోనూ కనిపించనుందని క్లారిటీ ఇచ్చింది. యావరేజ్ గా చూసుకుంటే.. 112 స్థానాలు వైసీపీ గెలుచుకునే అవకాశం ఉండగా.. కూటమి 63 సీట్లకు పరిమితమవుతుందని భావించవచ్చన్నమాట!
రానున్న ఎన్నికల్లోనూ తమదే విజయం అని వైసీపీ ధీమాగా చెప్తోంది. 95 శాతం హామీల అమలు.. కరోనా కాలంలో సంక్షేమ పథకాల కొనసాగింపు.. ఇవన్నీ ప్రజలకు తెలుసని వైసీపీ ధీమాగా చెప్తోంది. ఇదే సమయంలో జగన్ ప్రభుత్వం చేపట్టిన పారిశ్రామిక విధానంతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ అగ్రస్థానంలో నిలుస్తుందని లెక్కలు చెబుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా జగన్ ప్రభుత్వ హయాంలో.. 4 ఓడరేవులు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, 10 షిప్పింగ్ హార్బర్లు, 10 ఇండస్ట్రియల్ నోడ్స్ తో పారిశ్రామిక ప్రగతి సాధించినట్లు చెప్తున్నారు.
పారిశ్రామికాభివృద్ధి రేటులో 2018-19 నాటికి రాష్ట్రం 3.2 శాతంతో 22వ స్థానంలో ఉండగా.. 2021-22 నాటికి 12.8 శాతం వృద్ధి రేటుతో మూడో స్థానానికి ఎగబాకిందనే విషయం కేంద్ర గణాంకాలు చెబుతున్నాయన్నారు. వీటి ఫలితంగానే రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని నొక్కి చెప్తున్నారు. ఈ క్రమంలోనే తాజా ‘పోల్ ఆఫ్ పోల్స్’ ఫలితాలు కూడా ఏపీలో మళ్లీ జగనే సీఎ అవుతారనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని అంటున్నారు!