JAISW News Telugu

Telangana : తెలంగాణలో గెలవబోయేది ఆ పార్టీనే.. పోల్ స్ట్రాటజీ గ్రూప్ సర్వేలో సంచలనం

Telangana

Telangana 

Telangana : ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల సందడి నెలకొంది. ఇప్పటికే మూడు దశల పోలింగ్ పూర్తయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మే 13న నాలుగో దశలో ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శాయశక్తులా శ్రమిస్తున్నారు. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ అత్యధిక లోక్ సభ స్థానాలను గెలిచి తమ ఉనికి కాపాడుకోవాలని చూస్తోంది. ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ ఎన్నికలతో భూస్థాపితం చేయాలని నిర్ణయించుకుంది. అటు బీజేపీ కూడా ఎక్కువ సీట్లు గెలవాలన్న పట్టుదలతో ఉంది. దీంతో ఈ సారి ఎంపీ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.  రసవత్తరంగా సాగుతున్న ఎన్నికల పోరులో ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి. ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ విజయదుందుభి మోగించబోతున్నది అనేది ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా పోల్ స్ట్రాటజీ గ్రూప్ నిర్వహించిన ప్రీ పోల్ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

కాంగ్రెస్ బీజేపీ మధ్యే పోరు :

తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాల్లో పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య రసవత్తరంగా ఉండబోతున్నదని ఈ సర్వే స్పష్టం చేసింది. ఈ సర్వే ఫలితాల ప్రకారం కాంగ్రెస్ 4 స్థానాలు, బీజేపీ నాలుగు స్థానాలు, ఎంఐఎం 1 స్థానం గెలవబోతున్నట్లు సర్వేలో వెల్లడించింది. మూడు స్థానాల్లో బీజేపీ ఎడ్జ్ (2-5శాతం మార్జిన్)తో ముందంజలో ఉండగా మరో 3 స్థానాల్లో ఎడ్జ్ (2-5శాతం మార్జిన్)తో ముందంజలో ఉన్నట్లు తేల్చింది. మరో రెండు స్థానాల్లో పార్టీల మధ్యే టఫ్ ఫైట్ ఉండబోతున్నదని లెక్కకట్టింది.

నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే:

ఆదిలాబాద్: బీజేపీ ఎడ్జ్
భువనగిరి: కాంగ్రెస్ ఎడ్జ్
చేవెళ్ల: బీజేపీ
హైదరాబాద్: ఎంఐఎం
కరీంనగర్: బీజేపీ
ఖమ్మం : కాంగ్రెస్
మహబూబాబాద్: కాంగ్రెస్
మహబూబ్ నగర్: టఫ్ ఫైట్
మల్కాజిగిరి: బీజేపీ
మెదక్: టఫ్ ఫైట్
నాగర్ కర్నూల్: కాంగ్రెస్ ఎడ్జ్
నల్గొండ: కాంగ్రెస్
నిజామాబాద్: బీజేపీ
పెద్దపల్లి: కాంగ్రెస్
సికింద్రాబాద్: బీజేపీ ఎడ్జ్
వరంగల్: కాంగ్రెస్ ఎడ్జ్
జహీరాబాద్: బీజేపీ ఎడ్జ్

Exit mobile version