Pawan Kalyan : అక్టోబరు 15, 2022న జనసేన చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయం నమోదైందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ట్విటర్ లో అన్నారు. ‘అన్యాయానికి అడ్డుగా నిలబడేందుకు వీర మహిళలు, జనసైనికులు చూపిన సంకల్పబలం రాష్ట్రం మొత్తం చూసింది. నాకు సంఘీభావంగా ఓ తల్లి తన మూడేళ్ల బిడ్డతో అర్ధరాత్రి సమయంలో అక్కడ కూర్చుని తెలిపిన మద్దతు, దర్మార్గపు పాలనపై పోరాడేందుకు నాకు తిరుగులేని ధైర్యాన్ని, బలాన్ని ఇచ్చింది’ అని ట్వీట్ చేశారు.