Pawan Kalyan : ఆ జన ప్రభంజనం పవన్ కళ్యాణ్‌కే సాధ్యం.. జనసేనాని అంగీకరించిన వాస్తవం

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan : ‘‘కొన్నిసార్లు రావడం లేటు కావొచ్చేమో గానీ, రావడం మాత్రం పక్కా’’ పవన్‌ కల్యాణ్‌ రాజకీయాల్లోకి రాకముందు వేసిన డైలాగ్ ఇది. ఆయన రాజకీయాల్లోకి త్వరగానే వచ్చారు. కానీ, ‘అధ్యక్షా’ అని పిలవడానికి పదేళ్లు ఓ యుద్ధమే చేశారు. ఆయన శక్తి, సామర్థ్యం ఏంటో ప్రత్యర్థులకు తెలుసు. అందుకే పేదలకు నీడలా నిలబడదామనుకున్న ఆయనను పడగొట్టాలనుకున్నారు. వ్యక్తిగత విమర్శలతో అవమానించి హృదయాన్ని ముక్కలుగా చేయాలనుకున్నారు. దత్తపుత్రుడంటూ హేళన చేశారు. అయినా మొక్క వోని ధైర్యంతో పోరాడారు.  జనమే ప్రభంజనమై ఆయనను భారీ మెజార్టీతో గెలిపించారు. నేడు రాష్ట్ర మంత్రిగా ప్రజల రుణం తీర్చుకొనేందుకు సిద్ధమయ్యారు.

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి  అడుగుపెట్టిన ఆయన  పవర్‌స్టార్‌గా ఎదిగారు.  పవన్ కళ్యాణ్‌ మిగిలిన హీరోలతో పోలిస్తే చాలా ప్రత్యేకంగా ఉంటారు. సెట్‌లో లైట్‌బాయ్ నుంచి నిర్మాత వరకు అందరినీ సమానంగా చూడటం, గౌరవించడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం. సినీ జీవితంలో ఉన్నంత వరకు మీడియా, పబ్లిక్‌కు దూరంగా తన ఫాంహౌస్‌లో ప్రకృతి ఒడిలో సేదతీరడం ఆయనకు అలవాటు.  ఎప్పుడూ సమకాలీన సమస్యలపై స్పందిస్తూ.. తనను ఇంతటి వాడిని చేసిన జనం ఆపదలో ఉంటే మొదట స్పందించేది ఆయనే. కామన్‌మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ద్వారా పేదల అభ్యున్నతి కోసం తన వంతు సాయంగా విరాళాలు అందించారు.   సమాజానికి ఏదో చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చారు. అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అవినీతిని అస్సలు సహించలేని పవన్.. తన ప్రసంగాల్లో వాడి వేడి విమర్శలు చేసేవారు. ఇవి యువతను ఆలోచింపజేసి ఆయన బాటలో నడిచేలా చేశాయి. తన ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా జనసేన పార్టీని స్థాపించి పవన్ కళ్యాణ్ వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు.

దాదాపు పదేళ్ల పోరాటం తర్వాత  తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్.. డిప్యూటీ సీఎం పోస్ట్‌తో పాటు ఆరు కీలక శాఖలకు మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇవన్నీ ఆయనకు ఎంతో ఇష్టమైన పోర్ట్‌ఫోలియోలు కావడంతో వీటి ద్వారా తాను చేయాలనుకున్నది చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు పవన్.   రాజకీయ నాయకుల సభలు, సమావేశాలకు జనం పోటెత్తివస్తున్నారంటే దాని వెనుక చాలా కారణాలు ఉంటాయి.  తన సభలకు జనం రావడాన్ని పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రంలో జర్నలిస్ట్ పాత్రలో నటించారు. ఆ సినిమాలోని ఓ సన్నివేశంలో పవన్ పిలుపుతో లక్షలాది మంది కదిలివస్తారు. అయితే సినిమాల వరకు అలాంటిది సాధ్యం కానీ.. నిజజీవితంలో అన్ని లక్షల మంది వస్తారా అని అంతా తనను అడిగేవారని పవన్ తెలిపారు. కానీ ఇలాంటి ఫీట్ కేవలం పవన్ కళ్యాణ్ జీవితంలోనే జరుగుతుందని ఆయన తెలిపారు.

TAGS