JAISW News Telugu

PM Modi : మోడీ దృష్టిలో జగన్‌ కు ఉన్న విలువ అంతే..!

PM Modi

PM Modi

PM Modi : ప్రధాని మోడీకి దత్తపుత్రుడినని అందుకే ఇలా ఉన్నానని జగన్ అనుకుంటూ.. అరాచకాలు చేసుకుంటూ పోయారు. కానీ మోడీ దృష్టిలో మాత్రం జగన్  ఓ రాష్ట్ర సీఎం అంతే.. రాజ్యాంగపరమైన బాధ్యతల ప్రకారం.. ఏపీకి సహకరించడం వరకే.. తప్ప జగన్ రెడ్డిని మోడీ ఎప్పుడూ మిత్రుడిగా, వైసీపీని మిత్ర పక్షంగా చూడలేదు. ఈ విషయాలను మోడీనే స్వయంగా చెప్పారు. ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్యూలో మోదీ సూటిగా.. సుత్తి లేకుండా స్పష్టంగా చెప్పారు.

వైఎస్ జగన్ తన బీజేపీ పార్టీ విధానాలకు అనుగుణంగా ఉన్నాయని, తాము ప్రతిపాదించిన బిల్లులకు మద్దతిచ్చారని మోడీ భావన. అయితే జగన్ రెడ్డి బీజేపీకి ఐదేళ్ల పాటు సహకరించడానికి కారణం మోడీకి తెలుసు.. ప్రజలకు కూడా తెలుసు.. టీడీపీతో పొత్తు పెట్టుకున్నా ఇప్పటికీ బీజేపీని కానీ మోదీని కానీ పల్లెత్తు మాట అనే ధైర్యం చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి. ఇది ఆయన పరిస్థితి.

ఏపీలో పరిస్థితి మరింత ఘోరంగా ఉందని.. జగన్మోహన్ రెడ్డి మళ్లీ గెలిచే అవకాశం లేదని మోడీ భావన. మళ్లీ గెలవడం అంటే ఒక్క 2024లోనే కాదు ఇంకెప్పుడూ గెలవడం సాధ్యం కాదని మోడీ అనుకుంటున్నారు. బీజేపీ.. టీడీపీ.. జనసేన కూటమితో చేరడానికి ఇదే నమ్మకం కావచ్చు. టీడీపీతో కలవకుండా జగన్మోహన్ రెడ్డి బీజేపీని ఆపేందుకు చేయని ప్రయత్నాలే లేవు. చివరికి తాము ఎన్డీఏలో చేరేందుకు సిద్ధమయ్యారన్న ప్రచారం జరిగింది. కానీ మోడీ చేర్చుకోలేదని అంటున్నారు. జగన్ విషయంలో మోడీ అభిప్రాయం తెలిసిన తర్వాత అందులో ఆశ్చర్యం ఏ మాత్రం లేదని రాజకీయవర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. 

Exit mobile version