Pawan not criticize KCR Reason Behind : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బీజేపీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. వరంగల్ సభలో తెలంగాణ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అంటే తనకు అభిమానమని గుర్తు చేసుకున్నారు. నాకు రాజకీయాలు నేర్పింది కూడా తెలంగాణ అని పేర్కొన్నారు. అలాంటి తెలంగాణలో ఇక మీదట తన అవసరం ఉందనుకుంటే కచ్చితంగా రాజకీయాలు చేస్తానని కుండ బద్దలు కొట్టారు.
ఇన్నాళ్లు కేసీఆర్ ను విమర్శించకపోవడానికి ప్రత్యేక కారణం చెప్పారు. తెలంగాణ వచ్చాక పదేళ్లు ఎవరు అధికారంలో ఉన్నా వారిని ఒక్క మాట కూడా అననని నిర్ణయం తీసుకున్నాను. అందుకే పదేళ్లు పూర్తయ్యాక తెలంగాణ గురించి మాట్లాడటానికి ముందుకు వచ్చాను. దశాబ్దం పాటు నోరు దగ్గర పెట్టుకుని ఉన్నా ఇక మీదట ఇక్కడ కూడా జనసేన రాజకీయం చేస్తుందని ప్రకటించారు.
తెలంగాణ ఉద్యమంలో సకలజనుల సమ్మె, తెలంగాణ వీరుల బలిదానం చేసిన వారి గౌరవార్థం తెలంగాణ కోరుకున్న వారిని గౌరవించానన్నారు. ఏపీలో రౌడీలు, గూండాల పాలన చూసిన వాడిని తనకు గుండె బలం పెరిగిందన్నారు. తెలంగాణ నుంచి ఇవన్నీ నేర్చుకున్నానని చెప్పడం గమనార్హం. ఇక భవిష్యత్ లో జనసేన కూడా తెలంగాణలో పోరాడుతుంది. ప్రజా సమస్యల పరిష్కారంలో మా వంతు పాత్ర నిర్వహిస్తాం.
వచ్చే ఏడాది నుంచి తెలంగాణలో కూడా తిరుగుతాం. పరిపాలనలో మార్పును స్వాగతిస్తాం. కొందరు అవినీతి గురించి బహిరంగంగా మాట్లాడటం బాధ కలిగిస్తోంది. ప్రాజెక్టుల నిర్మాణంలో అంతులేని అవినీతి జరిగినట్లు ఆధారాలు చెబుతున్నాయి. దీన్ని ఖండిస్తున్నాం. బీజేపీతో పొత్తు కొనసాగుతుందని పేర్కొన్నారు. బీజేపీ జనసేన అభ్యర్థుల విజయం కోసమే తాను ప్రచారం చేస్తున్నానని ప్రకటించారు.