Ramyakrishna : రమ్యకృష్ణతో గొడవకు కారణం అదే.. అలా అవమానిస్తే ఊరుకోవాలా? వనితా విజయ్ కుమార్

Ramya krishna : తమిళ నటుడు విజయ్ కుమార్, వనితా విజయ్ కుమార్ ఎప్పుడూ వివాదాల్లో ఉంటారు. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఆమె వివాదాలతోనే సహవాసం చేస్తుంటారు. ఏ విషయాన్నైనా స్ట్రయిట్ గా చెప్పకుండా డొంక తిరుగుడు లేకుండా చెప్తారు. ఇది అందరికీ ఇష్టం ఉండదు.. అందుకే వనితపై విరుచుకుపడుతూ ఉంటారు. తండ్రి విజయ్ కుమార్‌తో తగాదాల కారణంగా కుటుంబ సభ్యులు ఆమెను ఇంటి నుంచి పంపించేశారు. ఇటీవల ఇంట్లో జరిగిన శుభకార్యానికి కూడా ఆమెను పిలవలేదంటే వారికి ఏ స్థాయిలో ఆమెపై కోపం ఉందో అర్ధం అవుతుంది.

తల్లిదండ్రులు ఇద్దరూ అగ్ర నటులు కావడంతో వనితా సులభంగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. చంద్రలేఖ సినిమాతో తెరంగేట్రం చేశారు. కోడి రామకృష్ణ ‘దేవి’ మూవీతో తెలుగువారిని పలకరించారు. ఈ చిత్రం తర్వాత ఆమెకు అవకాశాలు పెరిగాయి. ఆ సమయంలోనే పెళ్లి చేసుకొని గ్యాప్ ఇచ్చారు. 2013లో కంబ్యాక్ ఇచ్చారు. అయినా ఆమెకు అవకాశాలు రాలేదు. మళ్లీ పదేళ్ల తర్వాత అదృష్టం ఆమె ఇంటి తలుపు తట్టింది. ఏడాది నుంచి కొంచెం బిజీ అయ్యారు. సినిమాల్లో ఛాన్సులు లేకపోయినా బుల్లితెరపై సందడి చేశారు.

వనితా విజయ్ కుమార్ వైవాహిక జీవితం ఆది నుంచి వివాదాస్పదంగానే కొనసాగుతోంది. నటుడు ఆకాష్‌ను ఆమె వివాహం చేసుకోగా.. వీరికి విజయ్ శ్రీహరి, జోవిక అనే ఇద్దరు పిల్లలున్నారు. ఆకాష్‌తో విడిపోయాక బిజినెస్ మ్యాన్ ఆనంద్ జే రాజన్‌ను పెళ్లాడారు. వీరికి జయనిత అనే పాప ఉంది. కానీ ఈ వీరి బంధం ఎక్కువ రోజులు సాగలేదు. రాజన్‌తో విడాకులు తీసుకున్నాక చాలా సంవత్సరాలు ఒంటరిగానే ఉంది. 2020లో కొవిడ్ సమయంలో పీటర్ ను పెళ్లాడింది. వీరి మధ్య మనస్పర్థలు, పీటర్ మొదటి భార్యకు విడాకులు ఇవ్వకపోవడంతో విడిపోయారు. మద్యానికి బానిసైన పీటర్.. గతేడాది గుండెపోటుతో మరణించాడు.

ఇటీవలి ఒక ఇంటర్వ్యూలో వనితా విజయ్ కుమార్ ఓ ఛానెల్‌తో మాట్లాడారు. తన వైవాహిక జీవితం, కుటుంబ సమస్యలు, కెరీర్‌పై స్పందించారు. బిగ్‌బాస్ జోడిగల్ అనే రియాలిటీ షో నుంచి ఆమె అర్ధాంతరంగా తప్పుకుంది. దీనిపై వనితా విజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీనియర్ నటి రమ్యకృష్ణ వల్లే షోకు దూరమయ్యానని చెప్పింది. ఓ రోజు అమ్మవారి వేషంలో వనిత డ్యాన్స్ చేసింది. దీనికి జడ్జిగా ఉన్న రమ్యకృష్ణ మాట్లాడుతూ.. మేకప్ బాగుంది కానీ, డ్యాన్స్‌ సరిగా లేదని కామెంట్ చేసింది.

దీంతో వనిత స్టేజ్‌పైనే రమ్యకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జడ్జిమెంట్ ఇవ్వకుండా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నారంటూ అసహనం వ్యక్తం చేసింది. ఇతర కంటెస్టెంట్స్‌తో తన డ్యాన్స్‌ను పోల్చడం ఏంటంటూ ఫైరైంది. పక్కనే ఉన్న మరో జడ్జి రమ్యకృష్ణకు మద్ధతివ్వడంతో వనిత కోపంతో వెళ్లిపోయింది. తర్వాత ఏం జరిగిందో ఏమో గానీ వనిత మళ్లీ షోకు రాలేదు. తనకు రమ్య చిన్నప్పటి నుంచి తెలుసని, ఆమె అద్భుతమైన నటి అని ప్రశంసించారు. రమ్యకృష్ణతో ఎలాంటి గొడవ పడలేదని.. కేవలం జడ్జిమెంట్ విధానాన్ని తాను తప్పుబట్టినట్లు వెల్లడించారు. ప్రస్తుతం వనిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

TAGS