Power of Lokesh : దట్ ఈజ్ పవర్ ఆఫ్ లోకేష్.. ఒక్క జూమ్ కాల్ తో రాష్ట్రానికి రూ.1.45లక్షల కోట్ల కంపెనీ

power of Lokesh

power of Lokesh

power of Lokesh  : మంత్రిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర్నుండి రాష్ట్రాభివృద్ధి గురించి నారా లోకేష్ అహర్నిశలు శ్రమిస్తున్నారు. పెట్టుబడుల కోసం ఇప్పటికే అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. తాజాగా ఒక్క జూమ్ కాల్ మీటింగ్‌తో లక్షా నలభై వేల కోట్ల పెట్టుబడులను ఫైనల్ చేశారని ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజీ హెడ్డింగుతో ప్రచురించింది. ఈ మేరకు ఎకనామిక్ టైమ్స్ పత్రిక సంచలన కథనాన్ని రాసుకొచ్చింది. ఆర్సెలార్ మిట్టర్ ఏపీలో భారీగా పెట్టుబడులకు ఏర్పాట్లు చేస్తోందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ ఆర్సెలార్ తో పాటు నిప్పన్ స్టీల్స్ కంపెనీ జాయింట్ వెంచర్ గా ఏర్పడి ఈ పరిశ్రమను పెట్టబోతున్నాయి. రెండు విడతలుగా లక్షా నలభై వేలకోట్లను రాష్ట్రంలో పెట్టుబడిగా పెడతాయి.

అనకాపల్లి తీర ప్రాంతంలో స్థలంతో పాటు ఎగుమతులు, దిగుమతుల కోసం ఓ ప్రైవేట్ జెట్టీ ఉన్న ప్రాంతం కోసం తాము అన్వేషించామని ఆర్సెలార్ మిట్టల్, నిప్పన్ స్టీల్ ప్రతినిధి ఎకనమిక్ టైమ్స్ కు తెలిపారు. ఒడిశాతో పాటు ఏపీలోనూ పలు ప్రదేశాలు పరిశీలించామని కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఏపీలోని కక్కపల్లి ప్రాంతం అనువుగా ఉందన్నారు. అక్కడ ఇప్పటికే ఫార్మాకు చెందిన పరిశ్రమల కోసం సేకరించిన భూములు కూడా ఉన్నాయి. మరికొద్ది భూమిని సేకరిస్తే సరిపోతుంది. కంపెనీకి సౌకర్యంగా ఉండటంతో ఆర్సెలార్ మిట్టర్ యజమాని ఆదిత్య మిట్టల్‌తో లోకేష్ ఒక్క జూమ్ కాల్‌లో మాట్లాడారని పెట్టుబడులకు అంతా సిద్ధమైపోయిందని సదరు ఎకనమిక్స్ టైమ్స్ తెలిపింది.

ఆర్సెలార్ మిట్టల్, నిప్పన్ స్టీల్ ప్రపంచంలోనే అతి పెద్ద స్టీల్ ఉత్పత్తిదారులు. ఉత్పత్తి చేసిన దాంట్లో అత్యధికంగా ఎగుమతి చేస్తారు. ఈ పరిశ్రమ ఉత్తరాంధ్రను ఆర్థికంగా మరింత బలోపేతం చేయనుంది. ఈ ఏడాదిలోనే ఒప్పందాలు పూర్తయి.. పరిశ్రమ నిర్మాణ పనులు కూడా త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది. 2029 నాటికి తొలి దశ ఉత్పత్తిని మొదలుపెట్టనున్నారు. ఎకనామిక్ టైమ్స్ ప్రచురించిన కథనాన్ని ప్రముఖ వ్యాపారవేత్త మోహన్ దాస్ పాయ్ షేర్ చేశారు. ఆ ప్రాంతానికే కాకుండా మొత్తం ఏపీకి పెద్ద విజయం అన్నారు. ఈ కంపెనీ వల్ల వేల ఉద్యోగాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు.

TAGS