KCR : అదే మా ఆశ.. ఎగ్జిట్ పోల్స్ పై కేసీఆర్ రియాక్షన్

KCR

KCR

KCR : తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. ఆ పోల్ ఫలితాలను నమ్మాల్సిన పనిలేదని చెప్పారు. శనివాకం తుది దశ పోలింగ్ ముగియగా.. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇక పలు ఎగ్జిట్ పోల్ సంస్థలు తమ అంచనాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు.

తెలంగాణ భవన్ లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. అనంతరం ప్రసంగించారు. పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీకి ఎన్ని సీట్లైనా రావొచ్చునని చెప్పారు. నేడు సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్ స్థానిక సంస్థ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించారని గుర్తు చేశారు.  వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నికల్లోనూ తమ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయం సాధిస్తారని చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయో వేచి చూడాలని చెప్పారు.

ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతున్నారని, ఒకరు బీఆర్ఎస్ పార్టీకి 11 సీట్లు వస్తాయంటే, మరొకరు 1 సీటు మాత్రమే వస్తుందని చెబుతున్నారన్నారు. మరొకరు 2-4 సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారని ఇదంతా పెద్ద గ్యాంబ్లింగ్ అయిపోయిందని వ్యాఖ్యానించారు. మంచి ఫలితాలు వస్తాయని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. తమకు 11 సీట్లు వస్తే పొంగిపోయేది లేదని 2 సీట్లు వచ్చినా కుంగిపోయేది లేదని కేసీఆర్ పేర్కొన్నారు.

TAGS