Iron Leg Umpire : ఫైనల్ కు ఆ ఐరన్ లెగ్ అంపైర్.. అభిమానుల ఆందోళన

Iron Leg Umpire

Iron Leg Umpire, Final Match

Iron Leg Umpire Come Final Match : దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్లు గా ఉంది పరిస్థితి. భారత అభిమానులంతా వేయికళ్లతో ఎదురు చూస్తున్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ గెలవాలని కోరుకుంటున్నారు. ఇంతవరకు ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్ కు చేరిన జట్టు ఫైనల్ లో కూడా ఆస్ర్టేలియాను చిత్తు చేసి 2003 ఓటమికి బదులు తీర్చుకోవాలని చూస్తోంది. ఈనేపథ్యంలో ఆదివారం జరిగే ఫైనల్ కోసం అందరు ఉత్కంఠగా ఉన్నారు.

ఇక్కడో ట్విస్ట్ ఏర్పడింది. భారత క్రికెట్ అభిమానులు శనిదేవుడిలా భావించే అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో ఫైనల్ మ్యాచ్ కు అంపైర్ గా రానున్నాడని తెలుస్తోంది. అతడు అంపైరింగ్ చేసిన ఏ మ్యాచ్ కూడా భారత్ గెలవలేదు. దీంతో ఐరన్ లెగ్ అంపైర్ ఎలాంటి ప్రతికూలతలు తెస్తాడోనని భయపడిపోతున్నారు. అతడు అంపైరింగ్ చేసిన ఏ ఐసీసీ నాకౌట్ మ్యాచ్ లోనూ టీమింియా విజయం సాధించకపోవడం గమనార్హం.

ఈసారి అతడు రానుండటంతో ఏమవుతుందనే ఆందోళన అందరిలో నెలకొంది. కెటిల్ బరో అంపైర్ గా 2014 వరల్డ్ టీ20 ఫైనల్, 2015 వరల్డ్ కప్ సెమీ ఫైనల్, 2016 వరల్డ్ టీ20 సెమీ ఫైనల్, 2017 సీటీ ఫైనల్, 2019 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ ల్లో టీమిండియా ఓటమి పాలైంది. ఇలాంటి ఐరన్ లెగ్ ఉంటే మనకు విజయం దక్కుతుందో లేదో అనే బెంగ ప్రేక్షకుల్లో పట్టుకుంది.

ఐసీసీ నిబంధనల మేరకే అంపైర్లను నియమిస్తుంటారు. ఫైనల్ మ్యాచ్ కు అతడు రావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీంతో ఇక భారత్ లక్ ఎటు వైపు వెళ్తుందో తెలియడం లేదు. కోట్లాది మంది అభిమానుల ఆశలు ఏమవుతాయో అర్థం కావడం లేదు. తానోటి తలిస్తే దైవమొకటి తలిచే అన్నట్లు ఇప్పుడు ఈ అంపైర్ ఎందుకు వస్తున్నట్లు అని ప్రేక్షకులు తిట్టుకుంటున్నారు.

TAGS