Nagarjuna Heroine : 60 ఏండ్లు పైబడినా ఇప్పటికీ నవమన్మధుడిలా ఉండే నాగార్జున అప్పట్లో చేసినా ‘హడావిడి’ తక్కువేమి కాదు. ఇప్పటికీ ఆయనతో హీరోయిన్ గా చేయాలని కలలు కనే వారు ఉంటారు. అంటే అప్పట్లో ఈ కోరిక ఎంతుండేదో అర్థం చేసుకోవచ్చు. నాగార్జున కూడా తన గ్లామర్ కు తగ్గట్టు తన సినిమాల్లో గ్లామరస్ హీరోయిన్లకే ప్రిఫరెన్స్ ఇచ్చేవారు. అలా ఉంటే స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుందని నాగార్జున భావించేవారు.
90’ఎస్ లో ఈవీవీ డైరెక్షన్ లో వచ్చిన నాగార్జున ‘ఆవిడా.. మా ఆవిడే’ మీకు గుర్తుండే ఉంటుంది. ఈ మూవీ ఎప్పుడైనా యూట్యూబ్ లోనో, టీవీల్లోనూ వస్తే చూసేయ్యండి. ఈ మూవీలోని పాటలు, కామెడీ, లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ అత్యద్భుతంగా ఉంటాయి. నాగార్జున, బ్రహ్మనందం కాంబినేషన్ కామెడీ అయితే పీక్ లెవల్లో ఉంటుంది. ఇక నాగార్జునకు జోడిగా టబు, హీరా నటించారు. ఇందులో నాగార్జున రెండో భార్య ఝాన్సీ పాత్రలో హీరా నటించింది. ఇక ఇది ఈవీవీ సినిమా కాబట్టి ఆయన మార్క్ కామెడీ, శ్రుతిమించని అడల్డ్ సీన్స్ బోలెడు ఉంటాయి. నాగార్జునతో టబు, హీరా చేసే రొమాన్స్ కూడా మాములుగా ఉండదు. నాగ్ ,టబు కాంబినేషన్ గురించి మనకు తెలిసిందే కానీ.. నాగ్, హీరా చేసే రొమాన్స్ మనకు ఎక్కడో చెక్కిలిగింతలు పెడుతుంది.
చెన్నైకి చెందిన హీరా వెరీ గ్లామరస్ హీరోయిన్. నాజుగ్గా, మంచి కలర్ లో, మంచి ఫిట్ నెస్ తో ఉండడంతో పాటు అందాల ఆరబోతలో కూడా ఏమాత్రం వెనుకంజ వేసేది కాదు. ఈమె పబ్లిక్ రౌడీ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ తర్వాత దొంగల రాజ్యం, లిటిల్ సోల్జర్స్, శ్రీకారం, ఆహ్వానం, చెలికాడు. అంతపురం, అల్లుడుగారొచ్చారు..లాంటి సినిమాల్లో నటించింది. మణిరత్నం మూవీ ‘‘దొంగ..దొంగ’’ అనే సినిమా ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. ఇక ఆమె చివరిగా 1999లో స్వయంవరం సినిమాలో నటించింది. 2002లో పుష్కర్ మాధవ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం అమెరికాలో ఒంటరిగానే ఉంటోంది.
సినిమాలకు దూరంగా ఉంటున్న హీరా..అటు మెయిన్ మీడియాకు, సోషల్ మీడియాకు దూరంగానే ఉంటోంది. ఆమె హీరోయిన్ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అజిత్ తో ప్రేమలో పడింది. కానీ అది పెళ్లిదాక వెళ్లలేదు. అజిత్ ఆమెను ఎప్పుడూ దూరమే పెట్టాడని అంటారు. అజిత్ శాలిని పెళ్లి చేసుకున్నాడనేది మనకు తెలిసిందే. ఈ వ్యవహారం తర్వాత హీరా..సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. ప్రస్తుతం హీరా కు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇప్పటికీ బక్కపలుచగా, నాజుగ్గా, అదే గ్లామర్ మెయింటెన్ చేస్తున్నట్టు కనపడుతోంది. 50 ఏండ్ల వయస్సు దాటినా ఇంకా 30ఏండ్ల అమ్మాయిలాగే కనపడుతోంది.