JAISW News Telugu

OTT : ఓటీటీలో ఆ కంటెంట్ బ్యాన్ చేయాలి.. బలంగా వాదిస్తున్న ఎన్జీవో

OTT

OTT

OTT : భారతదేశం ప్రపంచంలో కెళ్లా భిన్నమైన దేశం. ఇక్కడి సంస్కృతులు సంప్రదాయాలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే భిన్నంగా ఉంటాయి. ఇతర దేశాలు కూడా వీటినే చూపుతూ గౌరవిస్తుంటాయి. ఏ దేశ సంస్కృతి ఆ దేశానికి గొప్పే. కానీ అన్ని విలువలతో కూడిన సంస్కృతి ఉంటేనే ఆ దేశానికి గౌరవం.

భారత్ సంప్రదాయ సెక్స్ నే అశ్లీలంగా భావిస్తుంది. ఇతర దేశాల్లో ముద్దులు, హగ్గులు సాధారణం కావచ్చు కానీ భారత్ లో బహిరంగంగా అవి నిశేధం. పైగా భార్య, భర్త ఏకాంతంగా ఉన్నప్పడు మాత్రమే వాటికి పర్మిషన్. పెద్దల ముందు, పిల్లల ముందు వీటిని నిర్వహించడం స్ట్రిట్లీ ప్రొహిబిటెడ్. కానీ ఆ సంస్కృతి రాను రాను మారుతోంది. అందుకు కారణం ముఖ్యంగా ఓటీటీనే.

కరోనా కంటే ముందే ఓటీటీ ఎంట్రీ ఇచ్చినా.. కరోనాలో మాత్రం అదే ముఖ్యంగా మారింది. బయటకు వెళ్లకపోవడం సోసల్ గ్యాదరింగ్ లాంటివి లేకపోవడంతో ఓటీటీలో మాత్రమే ఎంటర్ టైన్ మెంట్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో అందులో అశ్లీలం కూడా పెరిగింది. డిజిటల్ క్లాసుల పేరుతో చిన్నారులకు ఫోన్లు ఇవ్వడం. యాడ్స్ పేరుతో అప్పుడప్పుడు అశ్లీల వీడియోలు, ఫొటోలు ఠక్కున ప్రత్యక్షం కావడం కనిపిస్తుంది.

ఇటీవల ముంబైలో ఇద్దరు మైనర్లు (చిన్న పిల్లలు) అశ్లీల కంటెంట్ ను చూసి ఒకరిపై ఒకరు నగ్నంగా పడుకున్నారు. ఈ విషయాలను వారి తల్లిదండ్రులు చూసి దిగ్ర్భాంతికి లోనయ్యారు. అశ్లీల కంటెంట్ తో జరిగే ప్రమాదాలను ఇది నొక్కి చెప్తోంది. పెరుగుతున్న ఖర్చులతో తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తే పిల్లలను పట్టించుకునే వారు ఎవరు?

ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫాములు, సోషల్ నెట్వర్కింగ్ సైట్లు లైంగిక అసభ్యకర కంటెంట్ ను ప్రసారం చేస్తే వాటిని నిషేధించాలని ఉదయ్ మహుర్కర్ స్వచ్ఛంద సంస్థ (ఎన్జీవో) డిమాండ్ చేసింది. ప్రఖ్యాత జెమ్స్ ఆఫ్ బాలీవుడ్ తో సంబంధం ఉన్న అతని ‘సేవ్ కల్చర్ సేవ్ భారత్ ఫౌండేషన్’ లైంగిక వికృత కంటెంట్ ను నిషేధించాలని డిజిటల్ ఇండియా బిల్లును కోరింది. మీడియా ప్లాట్ ఫామ్ కు నైతిక చట్టాన్ని ప్రతిపాదించింది.

ఓటీటీ ప్లాట్ ఫాం పిల్లలను అనుచిత విషయాలకు బహిర్గతం చేస్తున్నాయని, ప్రస్తుత ఐటీ నిబంధనలు అసమర్థంగా ఉన్నాయని మహుర్కర్ విమర్శించారు. డిజిటల్ ఇండియా బిల్లు ప్రకారం.. ఇలాంటి కంటెంట్ ను నియంత్రించడంలో విఫలమైన కంటెంట్ ప్రొవైడర్లకు జరిమానాలు విధించాలని ఆయన సూచించారు.

నిషేధాల ప్రభావం ప్రశ్నార్థకమే అవుతుంది. యువత ఇప్పటికీ ఇతర మార్గాల ద్వారా అభ్యంతరకరమైన విషయాలను యాక్సెస్ చేసేందుకు మార్గాలను వెతుకుతుంది. బదులుగా, బలమైన తల్లిదండ్రుల పర్యవేక్షణ, కమ్యూనిటీ ఎడ్యుకేషన్ చొరవలు, మెరుగైన కంటెంట్ నియంత్రణను కలిగి ఉన్న సమగ్ర వ్యూహాల కోసం వాదించడం ముందుకు వెళ్లే మార్గం. ఓటీటీ నిషేధం భారతీయ సంస్కృతిని కాపాడేందుకు ఆచరణాత్మక, ఆదర్శవంతమైన పరిష్కారం కాకపోవచ్చన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. 

Exit mobile version