super six : సూపర్ సిక్స్ నుంచి తప్పించుకునేందుకే ఆ బడ్జెట్.. వైసీపీ ఫైర్..

super six

super six

super six : గత ప్రభుత్వ హాయాంలో ‘ఆంధ్రప్రదేశ్ శ్రీలంకగా మారబోతోందని, అతిపెద్ద ఆర్థిక సమస్య వచ్చి రాష్ట్రం మొత్తం అధోగతి పాలవుతుందని’ అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, దగ్గుబాటి పురందేశ్వరి వంటి వారు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అయితే ఈ విషయాన్ని గత సీఎం జగన్ అసెంబ్లీలో ప్రస్తావించారు. ‘మరి అప్పుడే రాష్ట్రం శ్రీలంకగా మారితే ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ ఎలా ప్రవేశపెట్టారని’ నిలదీశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 6 నెలలు గడిచినా బడ్జెట్ ను నామమాత్రంగా ప్రవేశపెట్టారని ఆరోపించారు. గతంలో కూటమి నేతల  మాటలను జగన్ గుర్తు చేశారు.

వైసీపీ పాలనలో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ ఎల్లో మీడియాలో అబద్ధాలు ప్రచారం చేశారని జగన్ ఆరోపించారు. అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీలను తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆక్షేపించారు. అధికారం చేపట్టిన 6 నెలల తర్వాత పూర్తి బడ్జెట్ పెట్టలేక ఓట్ ఆన్ బడ్జెట్ పెట్టి తప్పించుకున్నారని విమర్శించారు. నటనలో బాబు తన మామ ఎన్టీఆర్ ను మించిపోయారన్నారు.

గతంలో మా ప్రభుత్వం రూ. 14 లక్షల కోట్లు అప్పు చేసిందని ఈ పెద్ద మనుషులే విమర్శలు చేశారని.. ఇప్పటికీ దాన్ని దాన్ని నిరూపించలేక తేలిపోతున్నారని జగన్ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వానికి అప్పు పుట్టద్దనే ఇలాంటి దుష్రచారం చేశారన్నారు. మా ప్రభుత్వం దిగిపోయే నాటికి అప్పులు నాలుగున్నర లక్షల కోట్లని, గ్యారంటీ ఇచ్చినవి మరో లక్షన్నర అన్నారు. మొత్తం చూసినా రూ. 6 లక్షల కోట్లని ఇప్పుడు బడ్జెట్ లోనే చూపించారన్నారు. గతంలో రూ. 14 లక్షల కోట్లని చెప్పి ఇప్పుడు రూ. 6 లక్షల కోట్లు అని చూపించారన్నారు. దీన్ని బట్టి ఎవరి పాలన శ్రీలంక లాగా ఉందో చెప్పాలని నిలదీశారు.

వాస్తవాలు ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా బాబు అబద్దాలు మాత్రం ఆగడం లేదని జగన్ ఆక్షేపించారు. ప్రతీ ప్రభుత్వంలో ప్రతీ ఏటా బిల్లులు అప్ లోడ్ అవుతాయని వాటిలో పెండింగ్ ఉంటాయన్నారు. తాను దిగిపోతూ ఎన్ని వేల కోట్ల బిల్లులు బకాయిలు పెట్టారో గణాంకాలతో సహా జగన్ వివరించారు. అందులో డిస్కంల బకాయిలే రూ. 21541 కోట్లు ఉన్నాయన్నారు.

TAGS