Balarampur MLA : ఆ ఎమ్మెల్యేకు సొంత వాహనమే లేదా?
Balarampur MLA Have No Own Vehicle : ఈ రోజుల్లో వార్డు మెంబరే వాహనాలు వాడుతున్నారు. ఇక ఎమ్మెల్యే అయితే ఆ దర్జాయే వేరు. కొత్త కొత్త వాహనాల్లో తిరుగుతూ దర్జా ప్రదర్శిస్తుంటారు. గల్లీ లీడరైనా ఢిల్లీ లీడర్ లా ఫీలవుతుంటారు. కొందరు మాత్రం ఆదర్శవంతంగా జీవితం గడుపుతుంటారు. అలాంటి వారు తక్కువగానే ఉంటారు. గతంలో పుచ్చలపల్లి సుందరయ్య సైకిల్ పై పార్లమెంట్ కు వెళ్లిన నేతగా గుర్తింపు పొందారు. అలాంటి సాధారణ జీవితం గడిపే వారు సమాజంలో అరుదుగానే ఉంటారు.
ఆయన ఎమ్మెల్యే. కానీ ఆయనకు సొంత వాహనం లేదు. సొంత ఇల్లు కూడా లేదు. ఎటైనా వెళ్లాలంటే వీలైతే ప్రభుత్వ బస్సును ఉపయోగించుకుంటారు. లేదంటే కాలినడకనే ప్రయాణం. ఇలా సాదాసీదా జీవితం గడిపే ఎమ్మెల్యే ఎవరో తెలుసా. బీహార్ లోని బలరాంపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే మహబూబ్ ఆలం సాధారణ జీవితం గడుపుతున్నారు.
ఆయన లెఫ్ట్ పార్టీ ఎమ్మెల్యే 53,597 ఓట్ల మెజార్టీతో గెలిచారు. కానీ ఇంతవరకు చిన్న వాహనం కూడా కొనుక్కోలేదు. ఇలా నడిచి వెళ్తుంటారు. ప్రస్తుత రోజుల్లో సర్పంచ్ అయితేనే దర్జా ప్రదర్శిస్తుంటారు. కానీ ఆయన ఎమ్మెల్యే అయినా ఎక్కడ నామూషీగా ఫీల్ కారు. తన కాళ్ల మీదే ఆధారపడి నడుచుకుంటూ వెళ్లడం చూస్తే అందరు ఆశ్చర్యపోతుంటారు. కానీ ఆయన మాత్రం తన స్టైల్ మార్చుకోరు.
నీతి, నిజాయితీ, ఆదర్శం గురించి అందరు చెబుతారు. కానీ ఆచరించే వారు తక్కువగా ఉంటారు. అందులో ఆలం ఒకరు. ఇలా ఆయన తన జీవితం సాధారణంగా గడిపేందుకు నిర్ణయించుకున్నారు. భుజం మీద తన కొడుకును ఎత్తుకుని సంచార జీవులు వెళ్తున్నట్లు ఆయన కూడా కాలినడకనే వెళ్లడం చూసి అందరు అవాక్కవుతుంటారు.