Actress : సన్నగా ఉన్నావని ఎగతాళి.. ఇప్పుడు చెక్కిన శిల్పం అంటూ ప్రశంసలు
Actress : సినీ రంగంలో రాణించాలంటే అన్నింటినీ తట్టుకొని నిలబడాల్సిందే. ఒక్క అవకాశం కోసం సంవత్సరాల తరబడి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న వారు ఎందరో ఉన్నారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని తమ ఎదుగుదలకు ఉపయోగించుకొని స్టార్ డమ్ సొంతం చేసుకున్న వారు ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఉన్నారు. అలా ఒక్క అవకాశం ప్రాధేయపడిన ఓ హీరోయిన్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. సెలబ్రిటీ స్టేటస్ పొందింది. వందల కోట్లు పోగేసింది. ఆమె ఎవరో కాదు. ప్రముఖ హీరోయిన్ శిల్పా శెట్టి.
50 ఏళ్ల వయసులోనూ పాతికేళ్ల అమ్మాయిలకు తన అందంతో, చెక్కు చెదరని ఫిజిక్ సవాల్ విసురుతున్నది. కెరీర్ నాజుకు అందాలతో ఔరా అనిపిస్తుంది. ప్రస్తుత ట్రెండ్ లో హీరోయిన్స్ ఫిట్ నెస్కు చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ శిల్లా శెట్టి 90ల నుంచే ఫిట్నెస్ లో రాణిస్తున్నది. హాట్ బ్యూటీ శిల్పా శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కరలేని బాలీవుడ్ స్టార్. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది. బోల్డ్ -గ్లామర్ పాత్రలతో రాణించింది. కొంతకాలంగా తెరపై కనిపించకున్నా, ప్రేక్షకుల్లో ఆమెపై అభిమానం మాత్రం తగ్గలేదు.
శిల్పాశెట్టి పుట్టి పెరిగింది అంతా బెంగళూర్ లోనే. తండ్రి వ్యాపారవేత్త కావడంతో కుటుంబం అంతా ముంబైకి షిఫ్ట్ అయ్యింది. శిల్పా మొదటి సినిమా బాజీగర్. షారూఖ్ సరసన హీరోయిన్ గా చేసింది. ఈ సినిమాతో శిల్పాకు మంచి పేరొచ్చింది. కానీ అంతగా అవకాశాలు మాత్రం రాలేదు. ఆ తర్వాత అక్షయ్ కుమార్ తో చేసిన సినిమాలు ఆమెకు విజయాన్ని అందించాయి. అదే సమయంలో శిల్పా అక్షయ్ కుమార్ తో ప్రేమలో పడిందని రూమర్లు వచ్చాయి. తొలి సినిమా అవకాశం కోసం ఆడిషన్లకు వెళ్లినప్పుడు నల్లగా ఉన్నావని, మరీ సన్నగా ఉన్నావని ఎగతాళి సైతం చేశారు.ధడ్కన్ సినిమాతో తనలో మంచి నటి ఉందని ప్రూవ్ చేసుకున్నది శిల్పా. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ హిట్లతో అగ్ర స్థానానికి చేరుకున్నది. 2009లో రాజ్ కుంద్రాను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు.
యోగాతో మరింత ఫేమస్..
బాలీవుడ్ హీరోయిన్లలో తొలిసారి యోగాను పరిచయం చేసింది శిల్పా శెట్టినే. ఆ తర్వాత చాలా మంది హీరోయిన్లు యోగాను అనుసరించడం మొదలుపెట్టారు. శిల్పా చేసే ఆసనాలు మంత్రముగ్దులను చేస్తుంటాయి. విల్లులా తన శరీరాన్ని వంచుతుంది. తన అందాన్ని ఇప్పటికీ కాపాడుకుంటున్నాను అంటే అది యోగాతోనే సాధ్యమైందని చెబుతుంటుంది.