Rajamouli : ఆ నటుడు రాజమౌళికి సెంటిమెంటా? ప్రతి సినిమాలో ఉండాల్సిందేనా?
Rajamouli : టాలీవుడ్ నుంచి బాలీవుడ్ ను శాసించే స్థాయికి ఎదిగిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. తన మొదటి సినిమా నుంచి జాగ్రత్తగా అన్నీ ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాడు. తీసిని ప్రతి సినిమా ఒకదానిని మించి మరొకటి సక్సెస్ అవుతూ వస్తున్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో బాలీవుడ్ ను శాసించే స్థాయికి చేరుకున్నాడు రాజమౌళి. సినిమా ఇండస్ర్టీతో పాటు అభిమానులు కూడా మహేష్ బాబుతో సినిమాను ఎప్పుడు మొదలుపెడతాడా అని ఎదురు చూస్తున్నారు. సినిమా ఇండస్ర్టీ అంటేనే సెంటిమెంట్లకు పెట్టింది పేరు. ఒక్కొక్కరికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. మరి ఆ రాజమౌళికి ఆ సెంటిమెంట్ ఉందో లేదో తెలుసుకుందాం
తెలుగు సినిమా స్థాయిని ఆస్కార్ దాకా తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి. తన ప్రతి సినిమాను చాలా జాగ్రత్తగా శిల్పంలా చెక్కుతాడనే పేరుపొందాడు. అందుకే ఇండస్ర్టీలో రాజమౌళిని జక్కన్న అని పిలుస్తుంటారు. రాజమౌళి సినిమాలు. అతని దర్శకత్వ ప్రతిభపై హాలీవుడ్ మేకర్స్ సైతం ప్రశంసలు కురిపించారు. బడాస్టార్లు సైతం జక్కన్న సినిమాల్లో విలన్ రోల్ లేదా గెస్ట్ రోల్ చేయాలని కోరుకుంటున్నారు. కానీ రాజమౌళి ప్రతి సినిమాలో మాత్రం ఒక నటుడు కచ్చితంగా ఉంటాడు. అతని పేరు చత్రిపతి శేఖర్. బుల్లి తెరపై రాజమౌళి దర్శకత్వంలో రూపొందించిన శాంతి నివాసం సీరియల్ నుంచి ఆర్ఆర్ ఆర్ వరకు ప్రతి ప్రాజెక్టులో భాగమయ్యాడు శేఖర్ .
స్టూడెంట్ నెంబర్ 1 సినిమా నుంచి మొదలు ఆర్ఆర్ఆర్ దాకా ప్రతి సినిమాలో కనిపించాడు శేఖర్. రాజమౌళి ఇప్పటి వరకు మొత్తం 12 చిత్రాలు రూపొందించగా 9 సినిమాల్లో శేఖర్ కీలక పాత్రలు పోషించాడు. డార్లింగ్ ప్రభాస్ ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ లో తొలిసారి ఛత్రపతి సినిమాలో హీరో ఫ్రెండ్ గా కీ రోల్ ప్లే చేశాడు. అప్పటి నుంచి శేఖర్ పేరు కాస్త ఛత్రపతి శేఖర్ గా మారిపోయింది. రాజమౌళి సినిమాల్లో ఈ శేఖర్ కనిపించడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది.
శాంతి నివాసం సీరియల్ సమయంలో శేఖర్ దర్శకుడు రాజమౌళికి పరిచయడం అయ్యాడు. ఇద్దరి మధ్య మంచి స్నేహ సంబంధాలు కూడా ఉన్నాయి. కానీ ఎప్పుడూ తనకు అవకాశాలు ఇవ్వమని శేఖర్ జక్కన్నను అడగలేదట. శేఖర్ లో మంచి నటుడు ఉన్నాడని, ఏ క్యారెక్టర్ ఇచ్చినా దానికి సంపూర్ణంగా పండిస్తాడని రాజమౌళి చెబుతుంటారు. అలా రాజమౌళి శేఖర్ ను తన ప్రాజెక్టులో భాగం చేసుకుంటూ ప్రత్యేక క్యారెక్టర్ లో నటింపజేస్తున్నాడు.