Bhashyam Praveen : పెదకూరపాడు నియోజకవర్గం ప్రజలకు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రజలు చైతన్యానికి మారుపేరుగా నిలిచి తెల్లవారకముందే పోలింగ్ బూతుల వద్దకు చేరుకొని ఓటు వేయడం శుభ పరిణామమని ఆయన పేర్కొన్నారు. సాయంత్రం వరకు ఓపిగ్గా పోలింగ్ బూతుల వద్ద వేచిఉండి తమ బాధ్యతను నెరవేర్చారని అన్నారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న పెదకూరపాడు కుటుంబ సభ్యులకు, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పని చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు పేరుపేరునా భాష్యం ప్రవీణ్ ధన్యవాదాలు తెలిపారు.
పెదకూరపాడు నియోజకవర్గంలో తన గెలుపు కోసం రాత్రనక, పగలనక కష్టపడిన టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు పేరుపేరునా భాష్యం ప్రవీణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నియోజకవర్గంలో ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరగడం సంతోషించదగ్గ విషయమని ఆయన పేర్కొన్నారు.